జాబ్‌చార్ట్‌ కేటాయించాలి: వీఆర్వోలు

ABN , First Publish Date - 2021-09-08T18:00:58+05:30 IST

వీఆర్వో వ్యవస్థను..

జాబ్‌చార్ట్‌ కేటాయించాలి: వీఆర్వోలు

జనగామ టౌన్‌: వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి ఏడాది కాలమైనప్పటికీ జాబ్‌చార్ట్‌ కేటాయించనందున ప్రభుత్వ వైఖరికి నిరసనగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా వీఆర్వోలు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఇందులో భాగంగా జనగామ తహసిల్దార్‌ కార్యాలయం ఎదుట వీఆర్వోల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో ధర్నా నిర్వహించారు. ఆందోళనలో సంఘం రాష్ట్రనేత రమేష్‌, జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దుచేసి సంవత్సరం దాటినా వారి స్థితిగతులను పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. వీఆర్వోల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాం డ్‌ చేశారు. నిరసనలో సంధ్యారాణి, రాజయ్య, ఉప్పలయ్య, యాదగిరి పాల్గొన్నారు.


దేవరుప్పుల: వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి ఏడాది కాలమైనప్పటికీ జాబ్‌చార్ట్‌ కేటాయించనందున మండ ల వీఆర్వోలు మంగళవారం తహసీల్‌ కార్యాలయం ఎదుట నల్ల బాడ్జీలతో నిరసన తెలిపారు. కార్యక్రమంలో వీఆర్వోలు మాన్‌సింగ్‌, అమరేందర్‌రెడ్డి, సోమిరెడ్డి, శ్రీకాంత్‌, శ్రీనివా్‌సరావు, గట్టుమల్లు, సత్తయ్య, వెంకన్న, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-09-08T18:00:58+05:30 IST