విశాఖ: రుణాల పేరుతో బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో భారీ మొత్తంలో ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. విశాఖకు చెందిన రెబ్బ సత్యనారాయణకు చెందిన రూ.100 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. చేపల చెరువుల కోసం రుణాల పేరిట ఐడీబీఐ బ్యాంకు నుంచి రూ.112 కోట్లు తీసుకున్నట్లు అభియోగాలను నమోదు చేసింది. 143 మంది బినామీల పేరిట రుణాలు పొంది మోసం చేసినట్లు ఈడీ పేర్కొంది. అమెరికాకు 24 లక్షల డాలర్ల విలువైన చేపలను, రొయ్యలను సత్యనారాయణ ఎగుమతి చేసినట్లు ఈడీ పేర్కొంది.
ఇవి కూడా చదవండి