దేశానికే ఆదర్శంగా రైతుబంధు నిలిచింది: పోచారం

ABN , First Publish Date - 2022-01-11T00:04:30+05:30 IST

దేశానికే ఆదర్శంగా నిలిచిన గొప్ప పథకం రైతుబందు కార్యక్రమం అని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

దేశానికే ఆదర్శంగా రైతుబంధు నిలిచింది: పోచారం

హైదరాబాద్: దేశానికే ఆదర్శంగా నిలిచిన గొప్ప పథకం రైతుబందు కార్యక్రమం అని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం ఎన్టీఆర్ స్టేడియంలో పశుసంవర్ధక, మత్స్య శాఖల  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుబంధు సంబురాలలో శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. వివిధ రంగులతో రూపొందించిన రైతు బాంధవుడు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చిత్రమాలిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ప్రదర్శించిన గంగిరెద్దుల ఆటలు, పెద్ద ఎత్తున ముగ్గులు, గొబ్బెమ్మల ఏర్పాటు, చెరుకు గడల ప్రదర్శన సంక్రాంతి పండుగను సందడిని తలపించింది.


ఈసందర్భంగా శాసనసభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అందరికి అన్నం పెట్టె రైతన్నకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహాయం రైతుబంధు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ మదిలో నుండి వచ్చిన పథకమే రైతు బంధు అన్నారు. పార్టీలకు, కుల మతాలకు అతీతంగా 63 లక్షల మంది రైతులకు రైతుబంధును తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నది. సీజన్ రాగనే రైతుబంధు డబ్బులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో పడుతున్నాయిని చెప్పారు.  కొంతమంది ఉచిత ఎరువులు అంటూ మాట్లాడడం హాస్యాస్పదం.  రైతుబందు ద్వారా ఎకరాకు ఏడాదికి పదివేల రూపాయలను అందిస్తున్నది రైతులు ఎరువులు, విత్తనాల కొనుగోలు చేయడానికే అన్నారు.


వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ  రైతుకు ఓనాడు అప్పు పుట్టేది కాదు. పెట్టుబడి కోసం తిరిగే పరిస్థితి అన్నారు. కుల, మతాలకు అతీతంగా  కేసీఆర్ గారు  తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ఇప్పటి వరకు 50 వేల కోట్లు సాయం చేశారని తెలిపారు. దేశంలో ఇలా సాయం చేసిన తొలి సీఎం కేసీఆర్ గారు మాత్రమేనని చెప్పారు.  ఇప్పటి వరకు ప్రభుత్వాలు రైతులపై పన్నులు వేశాయి. కాని రైతుకే పన్ను కట్టింది మాత్రం సీఎం కేసీఆర్ అన్నారు. బీజేపీది స్థానికులకు  ఉద్యోగాలు దొరకవద్దు అన్న కుటిల నీతి అని విమర్శించారు. బీజేపీ మాటలు కేవలం గోబెల్స్ ప్రచారం అన్నారు. 


రైతుబంధు సంబురాలలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ ఆలీ, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్, రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శాసనమండలి సభ్యులు ఎంఎస్ ప్రభాకర్, శాసనసభ్యులు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, దానం నాగేందర్, మాగంటి గోపినాద్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-11T00:04:30+05:30 IST