Speaker of the Assembly: నిష్పక్షపాతంగా నిర్ణయం

ABN , First Publish Date - 2022-08-18T13:52:15+05:30 IST

రాష్ట్ర శాసనసభలో ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే(AIADMK) సభాపక్ష ఉపనేత వివాదంపై నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకుంటానని అసెంబ్లీ స్పీకర్‌ అప్పావు

Speaker of the Assembly: నిష్పక్షపాతంగా నిర్ణయం

                              - అసెంబ్లీ స్పీకర్‌ అప్పావు


ప్యారీస్‌(చెన్నై), ఆగస్టు 17: రాష్ట్ర శాసనసభలో ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే(AIADMK) సభాపక్ష ఉపనేత వివాదంపై నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకుంటానని అసెంబ్లీ స్పీకర్‌ అప్పావు స్పష్టం చేశారు. 16వ శాసనసభ కార్యకలాపాల ముఖ్యాంశాల ను అసెంబ్లీ వెబ్‌సైట్‌లో బుధవారం అప్‌లోడ్‌ చేసే పనులను స్పీకర్‌ అప్పావు లాంఛనంగా ప్రారంభించారు. 2021 మే 11 నుంచి ఆగస్టు 26వ తేది వరకు 14 రోజులు అసెంబ్లీలో జరిగిన అంశాలను పీడీఎఫ్‌ రూపంలో అప్‌లోడ్‌ చేశారు. గత ఏడాది ఆగస్టు 2న జరిగిన శాసనసభ శతవార్షికోత్సవాల ముగింపు వేడుకలు, మాజీ ముఖ్యమంత్రులు కరుణానిధి చిత్రపటం ఆవిష్కరణ తదితర కార్యక్రమాలను ప్రజలు శాసనసభ వెబ్‌సైట్‌ ద్వారా వీక్షించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. సచివాలయంలో జరిగిన అప్‌లోడ్‌ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా స్పీకర్‌ అప్పావు మీడియాతో మాట్లాడుతూ... ప్రతిపక్ష ఉపనేత నియామకంపై ఒ.పన్నీర్‌సెల్వం, ఎడప్పాడి పళనిస్వామి(O. Panneerselvam, Edappadi Palaniswami) తనకు వేర్వేరుగా రాసిన లేఖలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా, శాసనసభ నిబంధనల ప్రకారం ఈ వ్యవహారంలో పారదర్శకమైన నిర్ణయం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ కార్యదర్శి శ్రీనివాసన్‌, రాష్ట్ర సమాచార ప్రసార శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-18T13:52:15+05:30 IST