గవర్నర్లు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి

ABN , First Publish Date - 2022-06-15T15:32:49+05:30 IST

రాజ్యాంగ విధుల ప్రకారం గవర్నర్లు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని శాసనసభ స్పీకర్‌ అప్పావు పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన వివిధ రాష్ట్రాల

గవర్నర్లు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి

                                - స్పీకర్‌ అప్పావు


చెన్నై, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ విధుల ప్రకారం గవర్నర్లు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని శాసనసభ స్పీకర్‌ అప్పావు పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన వివిధ రాష్ట్రాల శాసనసభ స్పీకర్లు, విధానమండలి చైర్మన్ల సమావేశంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. రాష్ట్ర శాసనసభ వ్యవహారా ల్లో చీటికిమాటికీ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని, శాసనసభలో చేసిన నిర్ణయాలను గవర్నర్‌ వీలైనంత త్వరగా ఆమోదించి పరిపాలన సవ్యంగా సాగేందుకు సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకంటూ ప్రత్యేక అధికారులు, విధివిధానాలను రాజ్యాంగ ధర్మాసనంలో సుస్పష్టంగా పేర్కొన్నారని, ఆ ప్రకారమే కేంద్రం రాష్ట్రాభివృద్ధికి దోహదం చేసే విషయాలపై దృష్టి సారించాలే తప్ప అభివృద్ధి అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు చేయకూడదని స్పష్టం చేశారు. శాసనసభ వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోకూడదని, ఇది ప్రజాస్వామ్యానికి హాని కలిగిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శాసనసభ సమావేశాలు కనీసపక్షంగా యేడాదికి 30 రోజులపాటే జరుగుతున్నాయని, సమావేశాలను మరిన్ని రోజులపాటు పాటు నిర్వహించేందుకు అనుమతించాలని, ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉందని అప్పావు పేర్కొన్నారు.  

Updated Date - 2022-06-15T15:32:49+05:30 IST