HP assembly polls: ప్రచారాన్ని ముమ్మరం చేసిన బీజేపీ, కాంగ్రెస్, ఆప్

ABN , First Publish Date - 2022-04-24T03:18:36+05:30 IST

HP assembly polls: ప్రచారాన్ని ముమ్మరం చేసిన బీజేపీ, కాంగ్రెస్, ఆప్

HP assembly polls: ప్రచారాన్ని ముమ్మరం చేసిన బీజేపీ, కాంగ్రెస్, ఆప్

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంవత్సరం చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తమ జెండా ఎగురవేసేందుకు బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. 


రాష్ట్రంలోని రాజకీయ ప్రాధాన్యత కలిగిన కాంగ్రా జిల్లాలో ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రోడ్‌షోలో పాల్గొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ శనివారం కాంగ్రాలోని షాపూర్‌లో ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని పెంచుతూ జిల్లాలోని హర్చాకియాన్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు 'పాదయాత్ర' చేశారు.


హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు అవకాశం ఇవ్వాలని ఓటర్లను కేజ్రీవాల్ కోరారు. ఆప్ రాష్ట్రంలో నిజాయితీ గల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని హామీ ఇచ్చారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ప్రధాన కార్యదర్శి కేవల్ సింగ్ పఠానియా నేతృత్వంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతి ఇతర సమస్యలపై కాంగ్రెస్ సభ్యులు నిరసనకు దిగారు.

Updated Date - 2022-04-24T03:18:36+05:30 IST