అమరావతి: అసెంబ్లీలో, మండలిలో తననే తిడుతున్నారని టీడీపీ నేత నారా లోకేష్ వాపోయారు. అసెంబ్లీలో తన తల్లిని దూషించారని, తనను తిడుతున్నారని తెలిపారు. తనను, తన తల్లిని దూషించినప్పుడు సీఎం జగన్, స్పీకర్ తమ్మినేని సీతారాం నవ్వుకున్నారని దుయ్యబట్టారు. సభలో లేని సభ్యుల గురించి మాట్లాడకూడదన్నారు. అయినా ప్రజల కోసం తిట్లన్నింటినీ భరిస్తామని చెప్పారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వాళ్లు తనను చూసి భయపడుతున్నారని నారా లోకేష్ ఎద్దేవాచేశారు.
మరోవైపు కల్తీసారా, మద్యంపై చర్చించాలంటూ మండలిలో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. మండలి పోడియం దగ్గర టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో టీడీపీ సభ్యులను ఒక్కరోజు సస్పెన్షన్ చేసిన మండలి చైర్మన్ ప్రకటించారు. టీడీపీ ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, అశోక్‌బాబు, దీపక్‌రెడ్డి, రామ్మోహన్, రామారావు, రవీంద్రనాథ్‌రెడ్డిలను సస్పెన్షన్ చేశారు. మండలిలో టీడీపీ సభ్యుల ఆందోళనల మధ్యే బిల్లులకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేయించుకుంది. అనంతరం శాసన మండలి రేపటికి వాయిదా వేశారు.
ఇవి కూడా చదవండి