అనంతపురం: అసెంబ్లీలో జరిగిన ఘటనను సమర్థించడం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అదే సందర్భంలో తమకు నోరుందనీ, తాము చెప్పిందే వినాలనే పద్ధతిని ప్రతిపక్షాలు వీడాలన్నారు. ఏదైనా సమస్య తలెత్తినపుడు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ నాయకులను కించపరిచిన సందర్భాలు లేకపోలేదని గుర్తుచేశారు. తమ పార్టీ శాసనసభ్యురాలు రోజాను ఎంతో అవమానిస్తూ కించపరిచారని తెలిపారు. ఆడపడుచుల ఆత్మగౌరవ సభలు నిర్వహించడమేంటని ప్రశ్నించారు. ఏ ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యమిచ్చిందో ప్రజలే తేలుస్తారన్నారు. ఇంత వరకూ తానెప్పుడూ గట్టిగా మాట్లాడలేదని తెలిపారు. అందర్నీ ఒకే గాటికి కడితే ఎలా అని బొత్స ప్రశ్నించారు. శాసనసభలో మాట్లాడితే ప్రతీది రికార్డు అవుతుందన్న విషయం చంద్రబాబుకు తెలుసని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.