అమరావతి, జనవరి 26(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ నెలాఖరున పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవనున్న నేపథ్యంలో రాష్ట్రాలు కూడా శాసనసభ బడ్జెట్ సమావేశాలకు సన్నద్ధమవుతున్నాయి. కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి ఒకటో తేదీన లోక్‌సభలో ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో వచ్చే నెల 14వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే వీలుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.