Abn logo
Oct 14 2020 @ 03:27AM

అసోంలో దారుణం.. రెండేళ్లుగా కూతురిపై తండ్రి అత్యాచారం

Kaakateeya

గువహటి: కూతురిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే కసాయి వాడిలా మారాడు. రెండేళ్ల నుంచి కూతురిపై భర్త అత్యాచారానికి పాల్పడుతున్నాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. గువహటిలో ఈ దారుణమైన ఘటన వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భార్యాభర్తలు విడాకులు తీసుకోవాలని నిశ్చయించుకోవడంతో కొంతకాలం నుంచి వేరువేరుగా జీవిస్తున్నారు. 14 ఏళ్ల కూతురు తండ్రి దగ్గరే ఉంటోంది. ఇదే సమయంలో తండ్రి కూతురిని లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. కూతురు అనే జాలి కూడా లేకుండా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. 

తన తండ్రి చేస్తున్న ఘోరం గురించి కూతురు ఇటీవల బంధువులకు చెప్పింది. బంధువుల ద్వారా ఈ విషయం బాధితురాలి తల్లికి తెలియడంతో ఆమె గత సోమవారం పోలీసులను ఆశ్రయించింది. భర్త కూతురిని లైంగికంగా వేధిస్తున్నాడంటూ కేసు పెట్టింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయస్థానం నిందితుడిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించింది.

Advertisement
Advertisement
Advertisement