గ్రామాల పేర్లు మార్చేందుకు సీఎం కసరత్తు

ABN , First Publish Date - 2022-02-17T01:05:33+05:30 IST

పేరులో ఏముందని సహజంగా అంటుంటాం. అయితే చాలానే ఉందంటున్నారు అసోం ముఖ్యమంత్రి హిమంత్ ..

గ్రామాల పేర్లు మార్చేందుకు సీఎం కసరత్తు

గువాహటి: పేరులో ఏముందని సహజంగా అంటుంటాం. అయితే చాలానే ఉందంటున్నారు అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ. రాష్ట్రంలోని పలు గ్రామాల పేర్లు మార్చాలని తమ ప్రభుత్వం అనుకుంటున్నట్టు ఆయన బుధవారంనాడు ఒక ట్వీట్‌లో తెలిపారు. నాగరికత, సంస్కృతి, కులమతాలను కించపరచేలా ఉండే పేర్లను బీజేపీ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం మార్పాలని అనుకుంటున్నట్టు చెప్పారు.


''పేరులో చాలానే ఉంది. ఒక సిటీ కావచ్చు, పట్టణం కావచ్చు, గ్రామం కావచ్చు. వాటి పేర్లు అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, నాగరికతను ప్రతిబించేలా ఉండాలి. త్వరలోనే ప్రభుత్వం ఒక పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తోంది. మన సంస్కృతి, నాగరికతకు భిన్నంగా కానీ, కులం, మతాన్ని కించపరచేలా ఉన్న పేర్లు కానీ మార్చేందుకు సూచనలు, సలహాలను ఆహ్వానిస్తాం" అని హిమంత్ బిస్వ శర్మ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, ఇదే అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు శర్మ సమాధానమిస్తూ, ప్రభుత్వం తనంత తానుగా ఏ పేర్లూ మార్పదని, ప్రజలే ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుని మార్పు కోరుతూ పోర్టల్ ద్వారా అప్లయ్ చేసుకోవాలని చెప్పారు.

Updated Date - 2022-02-17T01:05:33+05:30 IST