Abn logo
Aug 15 2020 @ 06:35AM

అసోంలో వరదలు...112కు చేరిన మృతుల సంఖ్య

గువాహటి (అసోం): భారీవర్షాల వల్ల అసోం రాష్ట్రంలో వెల్లువెత్తిన వరదల వల్ల మృతుల సంఖ్య 112కు పెరిగింది. నదులు ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తుండటంతో అసోంలోని 30 జిల్లాల్లో 56,89,584 మంది వరదల బారిన పడ్డారు. ధీమాజీ, బక్సా, మోరీగామ్  జిల్లాల్లో 13,205 మందిని సురక్షితప్రాంతాలకు తరలించారు. వరద బాధితుల కోసం సహాయ పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. వేలాది హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. అసోంలో వరదలకు తోడు మరోవైపు కరోనా ప్రబలుతూనే ఉంది. ఒక్క శుక్రవారం రోజే అసోంలో 2,706 కేసులు నమోదైనాయి. అసోంలో కరోనా కేసుల సంఖ్య 74,501కి చేరిందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హిమంతబిశ్వా శర్మ చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement