Assam floods:14కు పెరిగిన మృతుల సంఖ్య

ABN , First Publish Date - 2022-05-21T17:08:18+05:30 IST

భారీవర్షాల వల్ల వెల్లువెత్తిన వరదలు అసోం రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి....

Assam floods:14కు పెరిగిన మృతుల సంఖ్య

గువహటి : భారీవర్షాల వల్ల వెల్లువెత్తిన వరదలు అసోం రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి.అసోంలో వరదల వల్ల మరో నలుగురు మరణించారు. కచార్ జిల్లాలో ఇద్దరు మరణించగా, లఖింపూర్, నాగావ్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.ప్రస్తుత రుతుపవనాల ప్రభావం వల్ల వరదలు సంభవించాయి. కొండచరియలు విరిగిపడటంతో మరణించిన వారి సంఖ్య 14కి పెరిగింది. రాష్ట్రంలోని 34 జిల్లాల్లో 29లో దాదాపు 7.12 లక్షల మంది ప్రజలు వరదలతో సతమతమయ్యారు.వరదల వల్ల 29 జిల్లాల్లోని 2,251 గ్రామాల్లో 80036.90 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. 234 సహాయ శిబిరాల్లో 74,705 మందికి పైగా ఆశ్రయం కల్పించారు.బార్‌పేట, బిస్వనాథ్, బొంగైగావ్, కాచర్, చరైడియో, దర్రాంగ్, ధేమాజీ, ధుబ్రి, దిబ్రూఘర్, డిమా హసావో, గోల్‌పరా, గోలాఘాట్, హైలాకండి, హోజై, జోర్హాట్, కమ్‌రూప్, కమ్‌రూప్ మెట్రోపాలిటన్, కర్బీరాజ్‌గాన్, అంగ్లాంగ్, పశ్చిమ, కరీంఘర్‌పూర్, మజులి, మోరిగావ్, నాగావ్, నల్బరి, సోనిత్‌పూర్, సౌత్ సల్మార్, టిన్సుకియా, ఉదల్‌గురి ప్రాంతాల్లో రోడ్లు మునిగిపోయాయి. 


రైలు మార్గాలు తెగిపోయాయి. భారీ వర్షాలు అసోంలో సాధారణ జనజీవనానికి అంతరాయం కలిగించాయి.భారతీయ వైమానిక దళం సహాయంతో గత రెండు రోజుల్లో 24 మెట్రిక్ టన్నుల ఆహార పదార్థాలను అత్యంత ప్రభావితమైన డిమా హసావో జిల్లాకు రవాణా చేశారు. వరదల్లో చిక్కుకుపోయిన 269 మందిని సహాయ సిబ్బంది రక్షించారు. బాధిత ప్రజలకు ఉచిత సహాయాన్ని అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం క్యాచర్, డిమా హసావో జిల్లాకు అదనంగా రూ.2 కోట్లు కేటాయించింది.వరద సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు కాచర్, హోజాయ్, దర్రాంగ్, బిస్వనాథ్, నాగావ్, మోరిగావ్, డిమా హసావోలోని విపత్తు నిర్వహణ అధికారులకు మద్దతుగా యునిసెఫ్ ఏడు సాంకేతిక నిపుణులు, కన్సల్టెంట్‌ల బృందాలను పంపించింది. కోపిలి, కంపూర్, కోపిలి, దిసాంగ్, బ్రహ్మపుత్ర నదులు ప్రమాద స్థాయి కంటే ఎక్కువగా ప్రవహిస్తున్నాయి.


Updated Date - 2022-05-21T17:08:18+05:30 IST