Advertisement
Advertisement
Abn logo
Advertisement
Aug 28 2021 @ 11:54AM

Assam: వెల్లువెత్తిన వరదలు...243 గ్రామాలు ముంపు

గౌహతి (అసోం): అసోం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరదలు వెల్లువెత్తాయి. అసోంలోని 11 జిల్లాల్లో 1.33 లక్షల మంది ప్రజలు వరదల బారిన పడ్డారని అసోం రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఏజెన్సీ తాజా బులెటిన్ లో వెల్లడించింది.భారీవర్షాల వల్ల బిస్వానాథ్, బోనగైగామ్ చిరాంగ్, థీమాజీ, దిబ్రూఘడ్, జోర్హత్, లఖింపూర్, మాజులీ, శివసాగర్, సోనిట్ పూర్, తిన్ సుకియా ప్రాంతాల్లో వరదనీరు వెల్లువెత్తింది. వరదల బారిన పడిన 6,217 మందిని పునరావాస శిబిరాలకు తరలించారు. 

వరదల్లో చిక్కుకు పోయిన 162 మందిని, 40 జంతువులను పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ధీమాజీ, బోనగైగామ్, చిరాంగ్, టిన్ సుకియా జిల్లాల్లో వరదబాధితుల కోసం సహాయ పునరావాస శిబిరాలను ఏర్పాటు చేశారు. బ్రహ్మపుత్ర నది వరదనీటితో పొంగిపొర్లడంతో 243 గ్రామాలు నీట మునిగాయి.వరదల వల్ల 16 ప్రధాన రోడ్లు దెబ్బతిన్నాయి. 


Advertisement
Advertisement