కరోనా పేషెంట్ల కోసం చిందేసిన డాక్టర్!
ABN , First Publish Date - 2020-10-19T21:28:46+05:30 IST
వారు కరోనా పేషెంట్లు..ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రతిరోజూ డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందిని చూడటం తప్ప వారికి మరో వ్యాపకం లేదు. ‘కరోనా బారినపడ్డాము..మళ్లీ ఎలా కోలుకుంటామో’ అనే బాధ వారిని మనుసును మెలిపెడుతోంది. దీంతో ఆ ఆవేదన అంతా వారి ముఖంపై ప్రతిఫలించింది. వారి కళ్లలో బాధ స్పష్టంగా కనిపించింది.
ఇంటర్నెట్ డెస్క్: వారు కరోనా పేషెంట్లు..ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రతిరోజూ డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందిని చూడటం తప్ప వారికి మరో వ్యాపకం లేదు. ‘కరోనా బారినపడ్డాము..మళ్లీ ఎలా కోలుకుంటామో’ అనే బాధ వారిని మనుసును మెలిపెడుతోంది. దీంతో ఆ ఆవేదన అంతా వారి ముఖంపై ప్రతిఫలించింది. వారి కళ్లలో బాధ స్పష్టంగా కనిపించింది.
అయితే.. వారికి చికిత్స చేస్తున్న డాక్టర్‌ను కూడా ఇది కదిలించింది. అసలే ఆయన నిబద్ధత కలిగిన డాక్టర్.. తన కళ్లముందే పేషెంట్లు అలా ఆవేదన చెందటం చూసి ఆయన తట్టుకోలేకపోయారు. దీంతో వారిని ఎంటటైర్న్ చేసేందుకు ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు. హృతిక్ రోషన్ పాటకు అచ్చు ఆ హీరోలాగే డ్యాన్స్ చేస్తూ కరోనా పేషెంట్ల మూడ్ మార్చేశారు.
అసోం రాష్ట్రంలోని సిల్చర్ మెడికల్ కాలేజీలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. ఇలా పేషెంట్ల్ సంతోషం కోసం చిందేసిన ఆ డాక్టర్ పేరు అరూప్ సేనాపతి..ఈఎన్టీ సర్జెన్. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా బాట పట్టడంతో ఆయన క్షణాల్లో డ్యాన్సింగ్ డాక్టర్‌గా పాపులర్ అయిపోయారు. ఈ వీడియోపై స్పందించిన కొందరు ఏకంగా హృతిక్ రోషన్‌ను కూడా ట్యాగ్ చేశారు. మీరు ఆ డాక్టర్‌ను కచ్చితంగా మెచ్చుకోవాలి అంటూ ఆయన్ను కోరారు. ఈ డాన్సింగ్ డాక్టర్ నాట్యానికి ఫిదా అయిన మరి కొందరు..అరూప్ డ్యాన్స్‌నే తన కెరీర్‌గా ఎంచుకోవాల్సింది అంటూ కామెంట్లు పెట్టారు. అంతేకాదు.. వృత్తిపై ఆయనకున్న నిబద్ధతకు ప్రతి ఒక్కరూ అరూప్పై ప్రసంశలు కురిపించారు.