రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై Assam CM హిమంత బిశ్వ శర్మ ఆగ్రహం

ABN , First Publish Date - 2022-05-22T16:08:12+05:30 IST

బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై Assam CM హిమంత బిశ్వ శర్మ ఆగ్రహం

న్యూఢిల్లీ : బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అస్సాం (Assam) ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఘాటుగా స్పందించారు. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, అస్సాం, తమిళనాడు చర్చల ద్వారా భారత దేశంతో శాంతి ఒడంబడిక చేసుకున్నాయని రాహుల్ చెప్పడం పూర్తిగా తప్పు అని తెలిపారు. 


హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sharma) ఇచ్చిన ఓ ట్వీట్‌లో, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, అస్సాం, తమిళనాడు చర్చల ద్వారా భారత దేశంతో శాంతి ఒడంబడిక చేసుకున్నాయని రాహుల్ గాంధీ చెప్పడం పూర్తిగా తప్పు అని తెలిపారు. కేబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం అప్పటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ (Jawaharlal Nehru)  అస్సాంను పాకిస్థాన్‌ (Pakistan)కు వదిలిపెట్టారని, అందువల్ల మహాత్మా గాంధీ మద్దతుతో గోపీనాథ్ బొర్డోలోయ్ అస్సాంను భారత మాతతో కలిసి ఉండేలా చేయడం కోసం పోరాడవలసి వచ్చిందని చెప్పారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) వాస్తవాలను తెలుసుకోవాలని హితవు పలికారు. 


రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ సదస్సులో మాట్లాడుతూ, భారత దేశం పై స్థాయిలో తీసుకున్న నిర్ణయాలతో ఏర్పడలేదన్నారు. అది అట్టడుగు స్థాయి నుంచి పైపైకి ఎదిగిందని చెప్పారు. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, అస్సాం, తమిళనాడు కలిసి, చర్చల ద్వారా శాంతి ఒడంబడికను కుదుర్చుకున్నాయన్నారు. ఈ రాష్ట్రాల యూనియన్‌కు అభిప్రాయాలను పంచుకునే సాధనం అవసరమైందన్నారు. ఆ సాధనం రాజ్యాంగమని చెప్పారు. యూనియన్ ఆఫ్ స్టేట్స్ రాజ్యాంగం నుంచి ఒక వ్యక్తికి ఒక ఓటు ఉండటం, ఎన్నికల విధానం, ప్రజాస్వామిక వ్యవస్థ, ఎన్నికల కమిషన్, ఐఐటీలు, ఐఐఎంలు వచ్చాయన్నారు. 


Updated Date - 2022-05-22T16:08:12+05:30 IST