స్టార్ట్‌ప్స రంగంలో యాస్పైరింగ్‌ లీడర్‌ తెలంగాణ

ABN , First Publish Date - 2020-09-12T06:27:40+05:30 IST

స్టార్ట్‌ప్సకు అనుకూలమైన వాతావరణం (ఎకో సిస్టమ్‌) నెలకొల్పడంలో తెలంగాణ ముందంజలో ఉంది.

స్టార్ట్‌ప్స రంగంలో యాస్పైరింగ్‌ లీడర్‌ తెలంగాణ

న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి): స్టార్ట్‌ప్సకు అనుకూలమైన వాతావరణం (ఎకో సిస్టమ్‌) నెలకొల్పడంలో తెలంగాణ ముందంజలో ఉంది. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ర్యాంకు ల్లో తెలంగాణ రాష్ట్రం యాస్పైరింగ్‌ లీడర్‌గా నిలిచింది. స్టార్ట ప్స్‌ కోసం ఆయా రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలను పరిగణలోకి తీసుకొని కేంద్రం ఈ ర్యాంకులను ప్రకటించింది.  ఢిల్లీలో కేంద్ర వాణిజ్య, రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, కేంద్ర పట్టణాభివృద్ధి, పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరి ఈ ర్యాంకులను వెల్లడించారు. సంస్థాగత, నియంత్రణ మార్పులు, ప్రొక్యూర్‌మెంట్‌, ఇంక్యుబేషన్‌ హబ్స్‌, సీడింగ్‌ ఇన్నోవేషన్‌,స్కేలింగ్‌ ఇన్నోవేషన్‌, అవగాహన- ప్రచార కార్యక్రమాలు ఇలా 7 విస్తృత సంస్కరణలతో పాటు 30 యాక్షన్‌ పాయింట్లను ప్రామాణికంగా తీసుకొని ర్యాంకులను రూపొందించింది. రాష్ట్రాలను రెండు విభాగాలుగా విభజించింది. ఈశాన్య రాష్ట్రాలను వై కేటగిరిలో, ఇతర రాష్ట్రాలను ఎక్స్‌ కేటగిరిగా విభజించింది. ఎక్స్‌ కేటగిరి విభాగంలో తెలంగాణ యాస్పైరింగ్‌ లీడర్‌గా నిలిచింది. గుజరాత్‌ బెస్ట్‌ పెర్ఫార్మర్‌, కర్నాటక, కేరళ టాప్‌ పెర్ఫార్మర్స్‌గా, బిహార్‌, మహారాష్ట్ర, ఒడిసా, రాజస్థాన్‌ రాష్ట్రాలు లీడర్స్‌గా, తెలంగాణ, హరియాణ, జార్ఖండ్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు యాస్పైరింగ్‌ లీడర్స్‌ గా నిలిచాయి. కాగా, ప్రొక్యూర్‌మెంట్‌ ప్రామాణికంలో తెలంగాణ లీడర్‌గా ఉంది. స్టార్ట్‌పలను ప్రోత్సహించేందుకు తెలంగాణ  అనేక చర్యలు తీసుకుందని, చట్టాల్లో సవరణలు చేసిందని కేంద్రం తెలిపింది.అన్ని స్థాయిల్లో అవిష్కరణలు, ప్రయోగాలను నిర్వహించే వాతావరణం సృష్టించడానికి ఇన్నోవేషన్‌ పాలసీ తీసుకొచ్చిందని తెలిపింది. ప్రపంచంలోని టాప్‌ 10 బ్లాక్‌చైన్‌ నగరాల్లో హైదరాబాద్‌ ఒకటిగా నిలవడానికి బ్లాక్‌చైన్‌ పాలసీ స్టార్ట్‌పలకు ఉపయోగపడుతుందని పేర్కొంది. 

Updated Date - 2020-09-12T06:27:40+05:30 IST