ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు చేయూత: కేటీఆర్

ABN , First Publish Date - 2022-03-08T17:30:03+05:30 IST

తెలంగాణ ఆర్ధికంగా ఎదుగుతూ దేశానికి ఆర్థిక వనరులను సమకూర్చడంలో 4 వ స్థానంలో నిలవడం గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు.

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు చేయూత: కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణ ఆర్ధికంగా ఎదుగుతూ దేశానికి ఆర్థిక వనరులను సమకూర్చడంలో 4వ స్థానంలో నిలవడం గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం సంగారెడ్డిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఎస్ ఐపాస్ ద్వారా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు తెలంగాణ ప్రభుత్వం చేయూత అందిస్తుందన్నారు. హైదరాబాద్ ప్రపంచ వాక్సిన్ కేంద్రంగా ఎదిగిందని.. హైదరాబాద్ ఇప్పుడు ఇండియా బల్క్ డ్రగ్ కేంద్రం, ఫార్మా రాజధాని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుందన్నారు.


సరికొత్త ఆలోచనలతో ప్రగతి పథంలో ముందుకు వెళ్లే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తెలంగాణ ప్రభుత్వం మరింత ప్రోత్సాహం ఇస్తుందని తెలిపారు. అవసరమైతే మహిళా పారిశ్రామికవేత్తల కోసం మరోక వంద ఎకరాలు కేటాయించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కొత్త పరిశ్రమలతో నిరుద్యోగులకు ఉపాధి కల్పన, ఆర్థికంగా అన్నివర్గాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిరంతరం పారదర్శకంగా పనిచేస్తుందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-03-08T17:30:03+05:30 IST