ఏఎస్‌వో అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2021-06-18T06:20:46+05:30 IST

దర్శి తహసీల్దార్‌ కార్యాలయంలో ఏఎస్‌వోగా పనిచేస్తున్న రేగడి వెంకటేశ్వరరెడ్డి (45) మృతదేహం త్రిపురాంతకం వద్ద లభించింది.

ఏఎస్‌వో అనుమానాస్పద మృతి
వెంకటేశ్వరరెడ్డి ఫైల్‌


చెరువు సమీపంలో అవశేషాలు లభ్యం

దర్శి  అధికారి వెంకటేశ్వరరెడ్డిదిగా గుర్తింపు

గతనెలలో మిస్సింగ్‌ కేసు నమోదు

విచారణ చేపట్టిన పోలీసులు

త్రిపురాంతకం/దర్శి, జూన్‌ 17 : దర్శి తహసీల్దార్‌ కార్యాలయంలో ఏఎస్‌వోగా పనిచేస్తున్న రేగడి వెంకటేశ్వరరెడ్డి (45) మృతదేహం త్రిపురాంతకం వద్ద లభించింది. త్రిపురాంతకం వద్ద గల బాలత్రిపురసుందరీ ఆలయం వెనుక  చెరువులో చిల్లచెట్లలో ఉన్న శవాన్ని గొర్రెల కాపరులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. త్రిపురాంతకం చెరువు సమీపంలో మృత అవశేషాలను స్థానిక పోలీసులు బుధవారర రాత్రి గుర్తించారు. దర్శిలో ఏఎస్‌వోగా పనిచేస్తున్న దర్శి మండలం రామచంద్రాపురానికి చెందిన రేగటి వెంకటేశ్వరరెడ్డి గత నెల 23 నుంచి కనిపించకుండా పోవడంతో 28న మిస్సింగ్‌ కేసు నమోదైంది. గతంలో అతను తరచూ త్రిపురాంతకంలోని ఆలయాలలో పూజలకు వస్తుండడంతో దర్శి పోలీసులకు, బంధువులకు స్థానిక పోలీసులు సమాచారం ఇవ్వగా గురువారం వారు వచ్చి సంఘటనా ప్రాంతంలో ఉన్న దుస్తులు, చెప్పులు, బైకు తాళం ఆధారంగా గుర్తించారు. మృతదేహం అవశేషాలు ఉన్న ప్రాంతం వద్ద పురుగు మందు డబ్బా, మంచినీళ్ల బాటిల్‌ ఉన్నాయి. ఆ ప్రాంతం పూర్తిగా పిచ్చికంపతో నిండిపోయింది. పశువుల కాపరులు గమనించి సమాచారం ఇచ్చినట్లు త్రిపురాంతకం పోలీసులు తెలిపారు. కాగా దర్శి సీఐ భీమానాయక్‌, తన సిబ్బందితో ఆ ప్రాంతాన్ని అవశేషాలను పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం సీఐ మాట్లాడుతూ అన్ని రకాలుగా విచారణ చేసి నిజాలు వెలికి తీస్తామన్నారు. వెంకటేశ్వరరెడ్డి మృతికి అతని భార్య విజయ, బావమరుదులే కారణమని వెంకటేశ్వరరెడ్డి తరఫు వారు ఆరోపించారు. కాగా బంధువుల రోదనలు మిన్నంటాయి.

 

Updated Date - 2021-06-18T06:20:46+05:30 IST