అసమర్థ పాలన అంతమవ్వాలి

ABN , First Publish Date - 2022-07-04T06:16:33+05:30 IST

అసమర్థ పాలన అంతమవ్వాలి

అసమర్థ పాలన అంతమవ్వాలి
డీజేఆర్‌ చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో బడ్డీలు, తోపుడు బండ్లు అందజేస్తున్న బోడె ప్రసాద్‌, దండమూడి చౌదరి

ఉయ్యూరు, జూలై 3 : అంకమ్మ తల్లి ఆశీస్సులతో అందరూ సుఖశాంతులు, ఆయు రారోగ్యాలతో జీవించాలని, రాష్ట్రంలో అసమర్ధ పాలన అంతమై, రాష్ట్రం పురోభివృద్ధి చెందా లని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ అన్నారు. స్థానిక జంపాన వంశస్తుల అంకమ్మ తల్లి ఆలయంలో ఆదివారం పూజలు చేశారు. అమ్మవారి ఆలయంలో ఇటీవల సంబ రాలు జరుగగా వాటికి హాజరు కాలేకపోయిన బోడె ప్రసాద్‌ను  మాజీ చైర్మన్‌ జంపాన పూర్ణచం ద్రరావు, ఆలయ కమిటీ ప్రత్యేకంగా ఆహ్వా నించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు పలువురు ఘనస్వాగతం పలికి పుష్పాలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా  పూర్ణచంద్ర రావుతో కలసి ఆయన ప్రత్యేక  పూజలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ,  అమ్మవారి దయతో అందరూ ఆయురా రోగ్యాలు, పాడి పంటలతో సుఖశాంతులతో జీవించాలని కోరుకున్నట్టు తెలిపారు. జంపాన అర్జునరావు, టీడీపీ పట్టణ అధ్యక్షు డు జంపాన గుర్నాధరావు, బొర్రా కృష్ణ, మాజీ చైర్మన్‌ ఖుద్ధూస్‌, నజీర్‌, చిరంజీవి, జంగమయ్య, వాసు తదితరులు పాల్గొన్నారు. 

డీజేఆర్‌ చారిటబుల్‌ ట్రస్టు ద్వారా బడ్డీలు, తోపుడు బండ్లు అందజేత

పేదవర్గాలకు అండగా నిలిచేది  తెలుగు దేశం పార్టీ అని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ అన్నారు. మచిలీపట్నం పార్లమెంట్‌ జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు దండ మూడి చౌదరి ఆధ్వర్యంలో డీజేఆర్‌ చారిటబుల్‌ ట్రస్టు ద్వారా పేదలు, పార్టీ కార కర్తలకు ఉపాధి కోసం దాదాపు రూ. 1.50 లక్షల విలువ చేసే బడ్డీలు, తోపుడు బండ్లు, ప్లాట్‌ఫారమ్‌  రిక్షాను ఆదివారం అంద జేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ పార్టీ కార్యకర్తలు, పేద వర్గాలకు స్వయం ఉపాధి కోసం తోడ్పాటు అందిచడం అభినం దనీయమన్నారు. ప్రజల సొమ్ము రాబొందుల్లా  మెక్కడమే పనిగా అధికార పార్టీ నాయకులు  అలవాటు పడ్డారని విమ ర్శించారు. ఎంపీటీసీ సభ్యురాలు సజ్జా అనూష,  పార్టీ  మండల అధ్యక్షుడు వై. కుటుంబరావు, కాటూరి శరత్‌, ఆకునూరు సర్పంచ్‌ వసంతరావు, కోడె హరీష్‌, కూనప రెడ్డి వాసు, పరిమి భాస్కర్‌, యుగబాబు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-04T06:16:33+05:30 IST