నిధులున్నా... మరమ్మతులు చేపట్టని వైనం

ABN , First Publish Date - 2022-06-20T06:38:53+05:30 IST

జిల్లాలో ప్రధాన రహదారులు గుంతలమయంగా మారాయి. గ్రామీణ రహదారుల పరిస్థితి మరీ దారుణం. జాతీయ రహదారులు మినహాయిస్తే... రాష్ట్ర రహదారుల్లో ప్రయాణమంటేనే ప్రజ లు హడలెత్తిపోతున్నారు.

నిధులున్నా... మరమ్మతులు చేపట్టని వైనం
సోమనాథనగర్‌ నుంచి తపోవనం వెళ్లే రహదారి గుంతలమయం

అడుగుకో గుంత

నిధులున్నా... మరమ్మతులు చేపట్టని వైనం

ఇదీ జిల్లాలో రోడ్ల దుస్థితిారులు


అనంతపురం, ఆంధ్రజ్యోతి

జిల్లాలో ప్రధాన రహదారులు గుంతలమయంగా మారాయి. గ్రామీణ రహదారుల పరిస్థితి మరీ దారుణం. జాతీయ రహదారులు మినహాయిస్తే... రాష్ట్ర రహదారుల్లో ప్రయాణమంటేనే ప్రజ లు హడలెత్తిపోతున్నారు. అడుగడుగునా గుంతలు పడ్డాయి. ఎటుచూసినా కంకరతేలిన దారులే కనిపిస్తున్నాయి. రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం రూ.36 కోట్లు మంజూరు చేసింది. అధికారులు టెండర్లు పిలిచినా... ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త రోడ్డేసిన పరిస్థితులు దాదాపుగా లేవనే చెప్పాలి. వర్షాకా లంలో రోడ్లన్నీ కుంటలను తలపిస్తున్నాయి. ఈ తరహా రహదారులపై ప్రయాణం చేస్తున్న ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.  




-జిల్లా కేంద్రం అనంతపురం నగరంలోని సోమనాథ్‌నగర్‌ నుంచి తపోవనం వెళ్లే రహదారి గుంతలమయం కావడంతో కొద్దిపాటి వర్షమొచ్చినా... కుంటలను తలపిస్తున్నాయి. దీంతో ఎక్కడ గోతుందో తెలియని పరిస్థితుల్లో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. 

- అనంతపురం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ నుంచి తాడిపత్రి వెళ్లే బైపాస్‌ రోడ్డు గుంతలమయంగా మారింది. వర్షం వస్తే... ఆ రోడ్డు కుంటలను తలపిస్తోంది. రెండగుల గోతులున్నాయంటే... రోడ్డు ఎంత అధ్వానంగా ఉందో అర్థమ వుతోంది. రాత్రివేళల్లో ఆ రోడ్డుపై ప్రయాణం చేయాలంటేనే వాహనదారులు భయపడిపోతున్నారు. పొరపాటున ఏ గుంతలోకి టైరు పడితే ప్రమాదం జరుగుతుందోనని హడలిపోతున్నారు. అధికారులు ఆ రహదారిమీదుగా ప్రయాణం చేస్తున్నప్పటికీ... మరమ్మతులు చేయాలన్న యోచన చేయడం లేదు.

- గుంతకల్లు-పామిడి రహదారిలోని నెలగొండ రహదారిలో గుంతలమయంగా ఉన్న రోడ్డుపై ఆటో, వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వజ్రకరూరు-పామిడి రహదారిలోని చింతలాంపల్లి రోడ్లు గుంతలమయమయ్యాయి. దీంతో వాహనదారులు నరకయాతన పడుతున్నారు. నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏళ్లు గడుస్తున్నా రోడ్లు మరమ్మతులకు నోచుకోవడం లేదు. 

- ఉరవకొండ నియోజకవర్గంలోని విడపనకల్లు మీదుగా వెళ్లే పాల్తూరు-హావళిగి రోడ్డు గుంతలమయంగా మారింది. రోడ్డు ఎక్కడికక్కడ కోతకు గురైంది. గత ఏడాది ఇదే రోడ్డులో ఓ ఆర్టీసీ బస్సు చక్రాలు విరిగిపోయి, పొలాల్లోకి దూసుకు పోయింది. ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 

- ఉరవకొండ - కణేకల్లు ప్రధాన రహదారిలోని రేణుమాకులపల్లి వద్ద రోడ్డు అధ్వానంగా తయారైంది. రోడ్డుపై గుంతలు ఏర్పడడంతో ప్ర యాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేణుమాకులపల్లి నుం చి నింబగల్లు వరకూ రోడ్డు దారుణంగా తయారైంది. ఇటీవల తాత్కాలిక మరమ్మతులు చేపట్టినా ఎలాంటి ప్రయోజనం లేదు. 

- కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కుందుర్పి మండలం కరిగానిపల్లి-అపిలేపల్లి ప్రధాన రహదారి గ్రామీణ రహదారు లకంటే అధ్వానంగా మారింది. రోడ్డంతా కంకరతేలింది. ఓవైపు గుంతలు... మరోవైపు కంకర మీద ప్రయాణం కష్టంగా ఉందని వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. 15 కిలోమీటర్లు ప్రయాణానికి గంట సమయం పడుతోంది. 

- రాప్తాడు నియోజకవర్గంలోని కనగానపల్లి-కుర్లపల్లి తండా రహదారిలో ప్రయాణం చేయాలంటేనే... వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ రహదారిలో అడుగడుగుకూ గుంతలు పడటంతో పాటు కంకర తేలి ఎగుడు దిగుడుగా ఉండటంతో ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతం. ఆ రహదారి గుండా ప్రయాణించే వాహనదారులు, స్థానిక ప్రజలు వెన్నునొప్పితో బాధపడుతున్నారు. 

- పుట్లూరు- నార్పల రోడ్డు మరింత అధ్వానంగా తయారైంది. చిన్నపాటి వర్షానికి సుమారు కిలోమీటర్‌ మేర రోడ్డుపై నీరు నిలబడి వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. పుట్లూరు నుంచి నూతన  తారురోడ్డు నిర్మాణ పనులు చేపట్టి ఏడాది అవుతున్నా రోడ్డు పూర్తికాలేదు. దీంతో మడ్డిపల్లి గ్రామశివారులో కొండప్రాంతం దగ్గర సుమారు కిలోమీటర్‌ మేర వర్షపునీరు నిలబడుతోంది.



Updated Date - 2022-06-20T06:38:53+05:30 IST