రిచర్డ్స్‌ బెస్ట్‌ కానీ..

ABN , First Publish Date - 2020-04-08T09:09:27+05:30 IST

వెస్టిండీస్‌ గ్రేట్‌ వివియన్‌ రిచర్డ్స్‌ లాంటి గొప్ప బ్యాట్స్‌మన్‌ను తాను ఇంతవరకు చూడలేదని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ అన్నాడు. కానీ, విరాట్‌ కోహ్లీ ఆ విషయంలో పోటీకి వస్తున్నాడని చెప్పాడు. ‘రిచర్డ్స్‌ లాంటి బ్యాట్స్‌మన్‌ను నేను ఇంత

రిచర్డ్స్‌ బెస్ట్‌ కానీ..

  • ఆసీస్‌ మాజీ షేన్‌ వార్న్‌


న్యూఢిల్లీ: వెస్టిండీస్‌ గ్రేట్‌ వివియన్‌ రిచర్డ్స్‌ లాంటి గొప్ప బ్యాట్స్‌మన్‌ను తాను ఇంతవరకు చూడలేదని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ అన్నాడు. కానీ, విరాట్‌ కోహ్లీ ఆ విషయంలో పోటీకి వస్తున్నాడని చెప్పాడు. ‘రిచర్డ్స్‌ లాంటి బ్యాట్స్‌మన్‌ను నేను ఇంత వరకూ చూడలేదు. సచిన్‌, లారా లాంటి మేటి బ్యాట్స్‌మెన్‌తో నేను ఆడా. అయితే, ప్రస్తుత తరంలో మాత్రం విరాట్‌ భేష్‌..! వివ్‌ స్థానంలో మరొకరిని ఊహించడం కష్టమే. కానీ, కోహ్లీ ఆ దిశగా ఆలోచించేలా చేస్తున్నాడు’ అని వార్న్‌ ప్రశంసించాడు.

Updated Date - 2020-04-08T09:09:27+05:30 IST