Abn logo
Jun 21 2021 @ 23:30PM

సమాజం మనుగడ సాగించాలంటే అదొక్కటే మార్గం: ముఖేశ్ అంబానీ

ముంబై: సమాజం, వ్యాపారాలు మనగలగాలంటే సుస్థిరమైన వ్యాపార విధానాల్ని అవలంబించడమే ప్రస్తుతమున్న ఏకైక మార్గమని ఆసియా ఖండంలోని అపర కుబేరుడు, రిలయన్స్ సంస్థల అధినేత ముఖేశ్ అంబానీ తాజాగా స్ప్షష్టం చేశారు. వ్యాపారాలు ముందుకెళ్లాలంటే అదొక్కటే మార్గమని ఆయన కామెంట్ చేశారు. బిజెనెస్‌లను పర్యావరణ హితంగా మార్చాలంటే కొన్ని రిలయన్స్ వ్యాపారాలను కుదించుకోవాల్సి వస్తుందా అన్న ప్రశ్నకు ఆయన.. వ్యాపారం చేసే విధానాన్నే సమూలంగా మార్చి, భవిష్యత్తుతో సమ్మిళితం చేయాలంటూ సమాధానమిచ్చారు. 2035 కల్లా రిలయన్స్‌ సంస్థల కర్బన ఉద్గారాలను నికరంగా సున్నా స్థాయికి తేవాలంటూ గతేడాది ముఖేశ్ అంబానీ లక్ష్యాన్ని విధించుకున్న విషయం తెలిసిందే. అయితే..రిలయన్స్ ఆదాయంలో 60 శాతం శిలాజఇంధానాల ఆధారితమైనది కావడంతో ఈ మార్పు సాధించడం కొంచెం కష్టమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.