అమెరికాను అధిగమించే వ్యూహంతో దూసుకెళ్తున్న డ్రాగన్ కంట్రీ!

ABN , First Publish Date - 2020-10-20T12:46:34+05:30 IST

ఆసియా-పసిఫిక్‌ ప్రాంతాన్ని ప్రభావితం చేసే శక్తిమంతమైన దేశంగా చైనా ఎదుగుతోంది. ఇప్పటి వరకూ ఈ స్థానంలో ఉన్న అమెరికాను అధిగమించే వ్యూహంతో డ్రాగన్‌ దూసుకెళ్తోంది. సిడ్నీకి చెందిన లోవి ఇన్‌స్టి

అమెరికాను అధిగమించే వ్యూహంతో దూసుకెళ్తున్న డ్రాగన్ కంట్రీ!

న్యూఢిల్లీ, అక్టోబరు 19: ఆసియా-పసిఫిక్‌ ప్రాంతాన్ని ప్రభావితం చేసే శక్తిమంతమైన దేశంగా చైనా ఎదుగుతోంది. ఇప్పటి వరకూ ఈ స్థానంలో ఉన్న అమెరికాను అధిగమించే వ్యూహంతో డ్రాగన్‌ దూసుకెళ్తోంది. సిడ్నీకి చెందిన లోవి ఇన్‌స్టిట్యూట్‌ ఆసియా పవర్‌ ఇండెక్స్‌-2020 ప్రకారం.. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతాన్ని ప్రభావితం చేసే దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. చైనా రెండో స్థానంలో ఉన్నా అమెరికాకు అతి చేరువలో ఉంది. కొవిడ్‌ వ్యాప్తిని అడ్డుకోవడంలో అమెరికా తీరు దాని ప్రతిష్ఠను దెబ్బతీసింది. మూడోస్థానంలో జపాన్‌, నాలుగో స్థానంలో భారత్‌ నిలిచాయి. టాప్‌ 10దేశాల్లో ఆస్ట్రేలియా(5వ స్థానం), మలేషియా(6వ), దక్షిణ కొరియా(7వ), థాయ్‌లాండ్‌(8వ), సింగపూర్‌ (9వ), రష్యా(10వ) ఉన్నాయి. కాగా కొవిడ్‌ దెబ్బతో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి సామర్థ్యాన్ని కోల్పో యే పరిస్థితి ఏర్పడింది. 2030 నాటికి చైనా జీడీపీలో 50 శాతాన్ని భారత్‌ చేరుకుంటుందని అంచనా వేశారు. ఇప్పుడు మాత్రం 40శాతానికే చేరుకోవచ్చంటున్నారు.

Updated Date - 2020-10-20T12:46:34+05:30 IST