పసిడి పట్టు

ABN , First Publish Date - 2020-02-21T10:10:19+05:30 IST

ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షి్‌పలో గురువారం భారత అమ్మాయిలు ఉడుంపట్టు పట్టారు. నాలుగు విభాగాల్లో ఫైనల్స్‌కు దూసుకెళ్లి.. మూడు స్వర్ణాలు ...

పసిడి పట్టు

సరిత, దివ్య, పింకీకి స్వర్ణాలు

ఆసియా  రెజ్లింగ్‌లో నిర్మలకు రజతం

న్యూఢిల్లీ: ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షి్‌పలో గురువారం భారత అమ్మాయిలు ఉడుంపట్టు పట్టారు.  నాలుగు విభాగాల్లో ఫైనల్స్‌కు దూసుకెళ్లి.. మూడు స్వర్ణాలు కొల్లగొట్టారు. దివ్య కక్రాన్‌ (68 కిలోలు),  సరితా మోర్‌ (59 కిలోలు), పింకీ (55 కిలోలు) తమ విభాగాల్లో విజేతలుగా నిలవగా.. నిర్మలా దేవి (50 కిలోలు) రజతానికి పరిమితమైంది. ఫైనల్స్‌లో దివ్య 4-1తో నరుహ మత్సుయుకి (జపాన్‌)పై, సరితా మోర్‌ 3-2తో బాటెసెగ్‌ అట్లాసెసెగ్‌ (మంగోలియా)పై, పింకీ 2-1తో దుల్గూన్‌ బొలొర్మా (మంగోలియా)పై గెలిచి పసిడి పతకాలు నెగ్గారు. టైటిల్‌పోరులో నిర్మలా దేవి 2-3తో మిహో ఇగరషి (జపాన్‌) చేతిలో ఓడి రన్నర్‌పగా నిలిచింది. బరిలోకి దిగిన మరో భారత అమ్మాయి కిరణ్‌ (76 కి) మాత్రం పతకం సాధించడంలో విఫలమై సెమీ్‌సలోనే నిష్క్రమించింది. నవ్‌జోత్‌ కౌర్‌ (2018లో) తర్వాత  ఆసియా సీనియర్‌  రెజ్లింగ్‌లో భారత అమ్మాయిలు స్వర్ణాలు నెగ్గడం ఇదే తొలిసారి కావడం విశేషం. 

Updated Date - 2020-02-21T10:10:19+05:30 IST