ఆసియా హ్యాండ్‌బాల్‌లో ఖతార్‌ బోణీ

ABN , First Publish Date - 2022-06-23T08:54:08+05:30 IST

ఆసియా క్లబ్‌ లీగ్‌ పురుషుల హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ ఘనంగా ప్రారంభమైంది. ఇక్కడి గచ్చిబౌలి స్టేడియంలో బుధవారం మొదలైన ఈ టోర్నీలో ఖతార్‌కు

ఆసియా హ్యాండ్‌బాల్‌లో ఖతార్‌ బోణీ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఆసియా క్లబ్‌ లీగ్‌ పురుషుల హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ ఘనంగా ప్రారంభమైంది. ఇక్కడి గచ్చిబౌలి స్టేడియంలో బుధవారం మొదలైన ఈ టోర్నీలో ఖతార్‌కు చెందిన అరబీ స్పోర్ట్స్‌ క్లబ్‌ జట్టు శుభారంభం చేసింది. సౌదీ అరేబియాకు చెందిన అల్‌ నూర్‌ జట్టుపై  29-24 స్కోరు తేడాతో గెలుపొందింది. అంతకుముందు పోటీలను క్రీడాశాఖ కార్యదర్శి, శాట్స్‌ ఇన్‌చార్జ్‌ వీసీ, ఎండీ సందీ్‌పకుమార్‌ సుల్తానియా, శాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి, జాతీయ హ్యాండ్‌బాల్‌ సంఘం చీఫ్‌ జగన్మోహన్‌రావు ప్రారంభించారు. ఈనెల 30న టోర్నీ ముగియనుంది.  

Updated Date - 2022-06-23T08:54:08+05:30 IST