COVID effects: ఆసియా బ్యాడ్మింటన్ టోర్నమెంట్లు రద్దు

ABN , First Publish Date - 2021-08-11T17:49:32+05:30 IST

కొవిడ్-19 వైరస్ మహమ్మారి కారణంగా ఆసియా బ్యాడ్మింటన్ టోర్నమెంట్లను రద్దు చేశారు....

COVID effects: ఆసియా బ్యాడ్మింటన్ టోర్నమెంట్లు రద్దు

న్యూఢిల్లీ : కొవిడ్-19 వైరస్ మహమ్మారి కారణంగా ఆసియా బ్యాడ్మింటన్ టోర్నమెంట్లను రద్దు చేశారు. కొరియా ఓపెన్, మకావు ఓపెన్, కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లను రద్దు చేసినట్లు బాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్) బుధవారం ప్రకటించింది. కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ ఆగస్టు చివరిలో లేదా సెప్టెంబరులో, మాకావు ఓపెన్ టోర్నమెంట్ నవంబరులో జరగవచ్చని బీడబ్ల్యూఎఫ్ తెలిపింది. కొవిడ్ కేసుల వల్ల కొనసాగుతున్న ఆంక్షలు, సమస్యలతో ప్రస్థుతం టోర్నమెంట్లను రద్దు చేయడం మినమా వేరే మార్గం లేదని బీడబ్ల్యూఎఫ్ పేర్కొంది. ఆసియాలో డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో టోర్నమెంట్లను రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది కరోనా మహమ్మారి వల్ల బ్యాడ్మింటన్ క్యాలెండరు ప్రకారం పోటీల నిర్వహణకు విఘాతం వాటిల్లింది. 


Updated Date - 2021-08-11T17:49:32+05:30 IST