IND vs HK: హాంకాంగ్‌పై ‘సూర్య’ ప్రతాపం.. పసికూన ముందు పెద్ద టార్గెటే పెట్టారుగా..

ABN , First Publish Date - 2022-09-01T03:00:53+05:30 IST

పసికూన హాంకాంగ్‌పై టీమిండియా చెలరేగింది. సూర్య కుమార్ యాదవ్ సిక్స్‌లు, ఫోర్లతో హాంకాంగ్ బౌలర్లను వేటాడటంతో నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా జట్టు రెండు వికెట్ల నష్టానికి..

IND vs HK: హాంకాంగ్‌పై ‘సూర్య’ ప్రతాపం.. పసికూన ముందు పెద్ద టార్గెటే పెట్టారుగా..

దుబాయ్: పసికూన హాంకాంగ్‌పై టీమిండియా చెలరేగింది. సూర్య కుమార్ యాదవ్ సిక్స్‌లు, ఫోర్లతో హాంకాంగ్ బౌలర్లను వేటాడటంతో నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా జట్టు రెండు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. 193 పరుగుల భారీ లక్ష్యాన్ని హాంకాంగ్ జట్టు ముందు ఉంచింది. సూర్య కుమార్ యాదవ్ అద్భుత బ్యాటింగ్‌తో రాణించాడు. 26 బంతుల్లో ఆరు సిక్స్‌లు, ఆరు ఫోర్లతో బ్యాట్‌ను గట్టిగా ఝుళిపించి 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఎస్కేవైకు తోడు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా 44 బంతుల్లో 59 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో నాటౌట్‌గా నిలిచాడు. 20వ ఓవర్‌లో నాలుగు సిక్స్‌లతో సూర్య కుమార్ యాదవ్ హాంకాంగ్ బౌలర్ అర్షద్‌పై విరుచుకుపడ్డాడు.



అర్షద్ బౌలింగ్ చేసిన 20వ ఓవర్‌లో 26 పరుగులు టీమిండియా పిండుకోగలిగిందంటే సూర్య కుమార్ ఏ రేంజ్‌లో బౌలర్లకు చుక్కలు చూపించాడో అర్థం చేసుకోవచ్చు. 120 బంతుల్లో 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తే గానీ హాంకాంగ్‌కు గెలుపు సొంతం కాదు. RRR 9.65 ఉంది. ఆ స్థాయిలో బ్యాటింగ్ చేసే పరిస్థితి హాంకాంగ్ బ్యాట్స్‌మెన్స్‌కు ఉందో లేదో తెలియాలంటే మ్యాచ్ ముగిసేవరకూ వేచి చూడాల్సిందే. కేఎల్ రాహుల్ కూడా 36 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 21 పరుగులకే ఔట్ కావడం గమనార్హం. హాంకాంగ్ బౌలర్లలో మహ్మద్ ఘజన్‌ఫర్, ఆయుష్ శుక్లాకు చెరో వికెట్ దక్కింది. అర్షద్ బౌలింగ్ చేసిన మూడు ఓవర్లకు 53 పరుగులు సమర్పించుకున్నాడు.

Updated Date - 2022-09-01T03:00:53+05:30 IST