భద్రాద్రికొత్తగూడెం: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏఎస్ఐ సురేష్ మృతి చెందారు. కొత్తగూడెం-రామవరం గోధుమ వాగు బ్రిడ్జిపై బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో డీసీఆర్బీ ఏఎస్ఐ సురేష్ మృతి చెందారు. ఏఎస్ఐ సురేష్ మృతితో పోలీస్ శాఖలో విషాద ఛాయలు నెలకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.