ఐదో వికెట్.. రూట్ వికెట్ తీసిన అక్షర్

ABN , First Publish Date - 2021-02-25T23:22:58+05:30 IST

ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌ అవుటైపోయాడు. 19 పరుగులు స్కోరు వద్ద రూట్ అక్షర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో 56 పరుగులకే ఇంగ్లండ్ జట్టు 5 వికెట్లు కోల్పోయింది. ఈ వికెట్‌తో అక్షర్ రెండో ఇన్నింగ్స్‌లో..

ఐదో వికెట్.. రూట్ వికెట్ తీసిన అక్షర్

అహ్మదాబాద్: ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌ అవుటైపోయాడు. 19 పరుగులు స్కోరు వద్ద రూట్ అక్షర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో 56 పరుగులకే ఇంగ్లండ్ జట్టు 5 వికెట్లు కోల్పోయింది. ఈ వికెట్‌తో అక్షర్ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే క్రాలీని గోల్డెన్ డక్‌గా పెవిలియన్ పంపిన అక్షర్.. అదే ఓవర్లో మూడో బంతికి బెయిర్ స్టోను కూడా పెవిలియన్ చేర్చాడు. ఆ తరువాత డామ్ సిబ్లీని కూడా ఎల్బీగా అవుట్ చేశాడు. ఇక నాలుగో వికెట్‌గా బెన్ స్టోక్స్‌ను అశ్విన్ అవుట్ చేయగా.. కీలకమైన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ను అక్షర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌‌కు 25 పరుగుల ఆధిక్యం ఉంది.

Updated Date - 2021-02-25T23:22:58+05:30 IST