మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మామ మృతి

ABN , First Publish Date - 2021-04-19T06:08:55+05:30 IST

గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి మామ మాజీ సైనికుడు పుల్లారెడ్డిపల్లె గ్రామానికి చెందిన దప్పిలి చంద్రశేఖర్‌రెడ్డి (63) గుండెపోటుతో ఆదివారం తెల్లవారుజామున మృతిచెందారు.

మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మామ మృతి
నివాళులర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

కొమరోలు, ఏప్రిల్‌ 18 : గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి మామ మాజీ సైనికుడు పుల్లారెడ్డిపల్లె గ్రామానికి చెందిన దప్పిలి చంద్రశేఖర్‌రెడ్డి (63) గుండెపోటుతో ఆదివారం తెల్లవారుజామున మృతిచెందారు. చంద్రశేఖర్‌రెడ్డి సైన్యంలో పని చేసి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు. పెద్దకూతురు ముత్తుముల పుష్పలత మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి భార్య. రెండవ కూతురు పూనెలో సాఫ్ట్‌వేర్‌, పెద్దకుమారుడు దప్పిలి దశరథరామిరెడ్డి జైలు సూపరింటెండెంట్‌గా, రెండవ కుమారుడు సాఫ్ట్‌వేర్‌గా పని చేస్తున్నారు. ఆదివారం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకుని రాగా మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి నివాళులర్పించారు. ఆయన వెంట టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.


Updated Date - 2021-04-19T06:08:55+05:30 IST