Apr 16 2021 @ 23:17PM

అశోకవనంలో అర్జున కల్యాణం

విశ్వక్‌ సేన్‌ హీరోగా ‘అశోకవనంలో అర్జునకళ్యాణం’ సినిమా శుక్రవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో తల్లి దుర్గ క్లాప్‌ ఇచ్చారు. బీవీఎ్‌సఎన్‌ ప్రసాద్‌ సమర్పణలో భోగవల్లి బాపినీడు, ఇ. సుధీర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చింత విద్యాసాగర్‌ దర్శకుడు. ‘‘మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ను అర్జున్‌గా పరిచయం చేస్తున్నాం. ఇప్పటివరకూ అతను నటించిన చిత్రాలకు పూర్తి భిన్నమైన చిత్రమిది. ప్రేమ, వినోదం... అన్నీ ఉన్న సినిమా. టైటిల్‌ ఎంత వైవిధ్యంగా ఉందో, సినిమా కూడా అంతే వైవిధ్యంగా ఉంటుంది. త్వరలో చిత్రీకరణ ప్రారంభిస్తాం. హీరోయిన్‌, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కథ: రవికిరణ్‌ కోలా, సంగీతం: జయ ఫణి కృష్ణ.