అశోక్ లేలాండ్ జోరు.. పది శాతం పెరిగిన షేర్లు

ABN , First Publish Date - 2021-07-30T19:58:57+05:30 IST

హిందూజా గ్రూప్ కంపెనీ అశోక్ లేలాండ్ షేర్లు శుక్రవారం దూసుకుపోయాయి.

అశోక్ లేలాండ్ జోరు.. పది శాతం పెరిగిన షేర్లు

లండన్ : హిందూజా గ్రూప్ కంపెనీ అశోక్ లేలాండ్ షేర్లు శుక్రవారం దూసుకుపోయాయి. కమర్షియల్ వెహికల్ (సీవీ) మేజర్ బుధవారం తన విద్యుత్తు వాహనం(ఈవీ) రోడ్ మ్యాప్‌ను లైన్‌అప్ చేయడంతో అశోక్ లేలాండ్ షేర్లకు మంచి హైప్ వచ్చింది. దీంతో బీఎస్‌ఈలో శుక్రవారం పది శాతం పెరిగి రూ. 137.45 లకు చేరుకున్నాయి. ఇక... కంపెనీ స్టాక్ ట్రేడింగ్.. ఫిబ్రవరి 2, 2021 న రూ. 138.85 52 వారాల గరిష్ట స్థాయిని టచ్ చేసి, ముగిసింది. 


స్విచ్‌‌లో మైనారిటీ పెట్టుబడులు పెట్టడానికి ఎలక్ట్రిఫైడ్ కమర్షియల్ వాహనాల కంపెనీ అశోక్ లేలాండ్ అనుబంధ సంస్థ అయిన స్విచ్ మొబిలిటీ బుధవారం డ్రైవ్‌ట్రెయిన్, ఈ-ప్రొపల్షన్ సిస్టమ్స్‌లో గ్లోబల్ లీడర్‌గా వెలుగొందుతున్న డానా ఇన్‌కార్పొరేటెడ్‌తో వ్యూహాత్మక ఒప్పందాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ  ఒప్పందం నిబంధనల ప్రకారం, స్విచ్ మొబిలిటీలో డానా వ్యూహాత్మక పెట్టుబడిని పెట్టడంతో పాటు సంస్థ  ఈ-బస్, విద్యుత్తు వాహనాలు, వాణిజ్య వాహనాల ఆఫర్ కోసం ఎలక్ట్రిక్ డ్రైవ్‌ట్రెయిన్ భాగాల ప్రిఫర్డ్ సరఫరాదారుగా ఉంటుంది. 

Updated Date - 2021-07-30T19:58:57+05:30 IST