మరికొన్ని గంటల్లో కలుసుకోనున్న గెహ్లోత్, పైలట్

ABN , First Publish Date - 2020-08-13T01:53:15+05:30 IST

న్ని రోజుల పాటు ఎడ మొహం పెడ మొహంగా ఉన్న ముఖ్యమంత్రి గెహ్లోత్,

మరికొన్ని గంటల్లో కలుసుకోనున్న గెహ్లోత్, పైలట్

జైపూర్ : ఇన్ని రోజుల పాటు ఎడ మొహం పెడ మొహంగా ఉన్న ముఖ్యమంత్రి గెహ్లోత్, యువనేత సచిన్ పైలట్ గురువారం ఒకరినొకరు కలుసుకోనున్నారు. గురువారం జరగబోయే శాసన సభా పక్ష సమావేశం ఇందుకు వేదిక కానుంది. ఈ నెల 14 న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 

బల పరీక్షకు మొగ్గు చూపుతున్న సీఎం గెహ్లోత్

సచిన్ పైలట్ సొంత గూటికి వచ్చినా... సరే సీఎం గెహ్లోత్ బలపరీక్షకే మొగ్గు చూపుతున్నట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు. ఎక్కువ కాలం ఎమ్మెల్యేలను రిసార్టుల్లో ఉంచడం సాధ్యమయ్యే పని కాదని, తుది నిర్ణయం మాత్రం ఈ నెల 14 న తీసుకుంటారని సమాచారం. 19 మంది రెబెల్స్ తో కలిపితే.. కాంగ్రెస్ కు 200 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నట్లు లెక్క.


అయినా సరే గెహ్లోత్ బల పరీక్ష నిర్వహించాల్సిందేనని పట్టుబడుతున్నట్లు సమాచారం. ‘‘బల పరీక్షకే ఏకైక మార్గం. అందులో అనుమానం అవసరమే లేదు. ఈ సమయాన్ని మేము కచ్చితంగా వినియోగించుకుంటాం. నిండు అసెంబ్లీలోనే మా బలాన్ని నిరూపించుకుంటాం. మరో ఆర్నెళ్లు గొడవే లేదు’’ అని ఓ సీనియర్ నేత కుండ బద్దలు కొట్టారు. 


Updated Date - 2020-08-13T01:53:15+05:30 IST