అమరావతి: తమ ప్రభుత్వానికి ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు మాయని మచ్చగా ఉన్నాయని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆక్షేపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాట్లాడితే విశాఖను చూసుకోమని సీఎం జగన్ అన్నారని విజయసాయి అంటున్నారని తెలిపారు. విజయసాయిపై వచ్చిన ఫిర్యాదులపై పారదర్శకంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మాజీమంత్రి అశోక్‌గజపతిరాజుపై విజయసాయి చౌకబారు మాటలు సరికావని, పార్టీకి మంచిది కాదని ఆయన హితవుపలికారు. విజయసాయిరెడ్డి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అశోక్‌గజపతిరాజుపై చెత్తమాటలు మాట్లాడడం సరికాదన్నారు. అశోక్‌గజపతిరాజును చెడ్డ వాడు అని అన్నంత మాత్రాన విజయసాయి మంచి వాడు కాలేడని చెప్పారు. విశాఖలో 100 కోట్ల భూమిని కబ్జా చేశారని తనకు ఫోన్లు వస్తున్నాయని రఘురామకృష్ణరాజు తెలిపారు.