Abn logo
Sep 26 2021 @ 11:25AM

ఈ మూటల్లో ఉన్నది సరుకులో, కూరగాయలో కాదు.. మనుషుల చితాభస్మం.. ఇంతకీ ఇవి ఎవరివంటే...

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో భారతీయుల ప్రగాఢ విశ్వాసాలకు సంబంధించిన మహోన్నత కార్యక్రమం జరిగింది. ఇక్కడి సుభాష్ నగర్ విశ్రామ్ ఘాట్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రాంతానికి చెందిన సంస్కార్ సేవా సమితి... కరోనా, ఇతర వ్యాధులతో మృతి చెందినవారి చితా భస్మాలను హోషంగాబాధ్ తీసుకువెళ్లింది. అక్కడి నర్మదానదిలో ఈ చితాభస్మాలను నిమజ్జనం చేయనున్నారు. 

ఈ చితాభస్మాలలో అత్యధికం కరోనాతో మృతి చెందినవారివే ఉన్నాయి. ఈ చితాభస్మాలను నర్మదా నదిలో శాస్త్రబధ్దమైన రీతిలో నిమజ్జనం చేయనున్నారు. ఈ సందర్భంగా విశ్రామ్ ఘాట్ కమిటీ నిర్వాహకులు శోభ్రాజ్ ముఖ్వానీ మాట్లాడుతూ కరోనా కాలంలో అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించాక, వారి చితాభస్మాలను విశ్రామ్ ఘాట్‌లో ఉంచాం. వీటిని ఇప్పుడు శాస్త్రబద్ధంగా ఒకేసారి నర్మదానదిలో కలపనున్నామని తెలిపారు.

ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...