ఆశావర్కర్‌పై అత్యాచారం, హత్యకు పాల్పడిన నిందితులను శిక్షించాలి

ABN , First Publish Date - 2022-09-27T05:03:03+05:30 IST

పల్నాడు జిల్లా ఆశావర్కర్‌పై అత్యా చారం, హత్యకు పాల్పడిన నిందుతులను కఠినంగా శిక్షించాలని శ్రామిక మహిళా నాయకులు డి.కల్యాణి డిమాండ్‌ చేశారు.

ఆశావర్కర్‌పై అత్యాచారం, హత్యకు పాల్పడిన నిందితులను శిక్షించాలి
భీమవరం తహసీల్దార్‌కు వినతిపత్రం ఇస్తున్న ఆశా వర్కర్లు

భీమవరం అర్బన్‌, సెప్టెంబరు 26: పల్నాడు జిల్లా ఆశావర్కర్‌పై అత్యా చారం, హత్యకు పాల్పడిన నిందుతులను కఠినంగా శిక్షించాలని శ్రామిక మహిళా నాయకులు డి.కల్యాణి డిమాండ్‌ చేశారు. ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు సోమవారం సీఐటీయూ కార్యాలయం నుంచి ర్యాలీ వెళ్ళి తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. కల్యాణి, లారెన్స్‌ కుమారి మాట్లాడుతూ మహిళలు పని ప్రదేశాల్లోనే కాక బయట ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. నిందితులపై నిర్భయ కేసు నమోదు చేయాలని, చనిపోయిన ఆశా వర్కర్‌కు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒక రికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పి.రాజేశ్వరి, రమాదేవి, వరలక్ష్మి, దుర్గాభవాని, జ్యోతి, శివరంజని కుమారి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


ఆకివీడు: వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని సీఐటీయూ మండల అధ్యక్షుడు పెంకి అప్పారావు అన్నారు. ఆశా వర్కర్‌ను హత మార్చిన దోషులను కఠినంగా శిక్షించాలంటూ సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం దగ్గర సీఐటీయూ నేతృత్వంలో ధర్నా నిర్వహించి తహసీల్దార్‌ గురుమూర్తిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఆశా వర్కర్‌పై సామూహిక అత్యాచారం చేసి, హత్య చేసిన నిందితులపై నిర్భయ కేసు నమోదుచేయాలన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. తోట పద్మ, మార్తమ్మ, గోడి యశోద, మోటుపల్లి వెంకటలక్ష్మి, పి.సరోజని ఉన్నారు.


పెనుగొండ: ఆశా వర్కర్‌పై అత్యాచారం చేసి హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని ఆశా వర్కర్ల మండల నాయకురాలు కంకిపాడు లక్ష్మి కుమారి అన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. దుర్గ, మాదాసు నాగేశ్వరరావు, ఆశాలు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-27T05:03:03+05:30 IST