అసనూరు రహదారిపై ఏనుగుల సంచారం

ABN , First Publish Date - 2022-05-18T14:51:33+05:30 IST

ఈరోడ్‌ జిల్లా సత్యమంగళం సమీపంలోని అసనూరు రహదారిలో వారం రోజులుగా ఏనుగుల సంచారం అధికమైంది. ఆ రహదారిలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించే విధంగా ఈ

అసనూరు రహదారిపై ఏనుగుల సంచారం

చెన్నై: ఈరోడ్‌ జిల్లా సత్యమంగళం సమీపంలోని అసనూరు రహదారిలో వారం రోజులుగా  ఏనుగుల సంచారం అధికమైంది. ఆ రహదారిలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించే విధంగా ఈ  ఏనుగులు వరుసగా వెళుతున్నాయి. వాహనదారులు ఆ ఏనుగులను సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీయడానికి, వాటికి దగ్గరగా వెళ్ళి సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు అసనూరు రహదారిలో వెళ్లే వాహనదారులు ఏనుగులకు ఎలాంటి ఆటంకాలు కలిగించకూడదని హెచ్చరించారు. సత్యమంగళం పులుల అభయారణ్యం సమీపంలో అడవులలో ఏనుగుల సంచారం అధికంగా ఉందని, సత్యమంగళం -మైసూరు జాతీయ రహదారిలో ఉన్న అసనూరు వద్ద ఈ ఏనుగులు రోడ్డును దాటుకుని అడవులలోకి వెళుతుంటాయని వివరించారు. కొన్ని సందర్భాలలో ఆ ఏనుగులు రహదారిలో వెళుతున్న వాహనాలను అడ్డగిస్తాయని తెలిపారు. ఈ పరిస్థితులలో ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు ఏనుగులకు ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని అటవీ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-05-18T14:51:33+05:30 IST