బంగాళాఖాతంలో ‘అసాని’ తుఫాను

ABN , First Publish Date - 2022-03-22T16:28:24+05:30 IST

బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పవాయుపీడనం సోమవారం మధ్యాహ్నం వాయుగుండంగా మారినట్లు స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు.

బంగాళాఖాతంలో ‘అసాని’ తుఫాను

తమిళజాలర్లకు తీవ్ర హెచ్చరిక

చెన్నై, మార్చి 21 (ఆంధ్రజ్యోతి):  బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పవాయుపీడనం సోమవారం మధ్యాహ్నం వాయుగుండంగా మారినట్లు స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు. ఈ వాయుగుండం ‘అసాని’ తుఫానుగా మారి అండమాన్‌, మాల్దీవుల ప్రాంతాల్లో వర్షబీభత్సాన్ని సృష్టించనున్నదని పేర్కొన్నారు. ఈ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో సముద్రతీర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు.


తూత్తుకుడి జిల్లాలో ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయని, సముద్రంలో పెనుగాలులు వీస్తాయని, జాలర్లు రెండు రోజులపాటు చేపలవేట మానుకోవాలని హెచ్చరించారు.  సముద్రతీర జిల్లాల్లో 4రోజులపాటు వర్షం కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. ప్రస్తుతం చేపలవేటకు వెళ్ళిన జాలర్లంతా తీరానికి తిరిగి రావాలంటూ కోస్ట్‌గార్‌ సిబ్బంది గస్తీ నౌకలలో వెళ్ళి చేపలుపడుతున్న జాలర్లకు మెగాఫోన్ల ద్వారా హెచ్చరికలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా అండమాన్‌లో తుఫాను ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టే నిమిత్తం అరక్కోణం నుండి రాజాళి నావికదళంలోని జాతీయ విపత్తుల నివారణ బృందాలు అక్కడికి తరలివెళ్ళాయి సుమారు 130 మంది కమెండోలు బయలుదేరి వెళ్ళారు.

Updated Date - 2022-03-22T16:28:24+05:30 IST