అసంపూర్తి వంతెనలు! ప్రయాణికుల పాట్లు!!

ABN , First Publish Date - 2022-05-18T06:34:09+05:30 IST

మండలంలో రవాణా వ్యవస్థ అత్యంత అధ్వానంగా వుంది.

అసంపూర్తి వంతెనలు!  ప్రయాణికుల పాట్లు!!

మూడేళ్ల నుంచి ఎక్కడి నిర్మాణాలు అక్కడే

వరహా నదిపై జల్లూరు వంతెన పనులు2018లో ప్రారంభం

సాధారణ ఎన్నికలనాటికి సగానికిపైగా పూర్తి

వైసీపీ ప్రభుత్వ ఆదేశాలతో పనులు ఆపేసిన కాంట్రాక్టర్‌

పనులు పునఃప్రారంభించాలని రెండు నెలల క్రితం అధికారులు సమాచారం

ప్రస్తుత ధరల ప్రకారం గిట్టుబాటు కాదని చేతులెత్తేసిన కాంట్రాక్టర్‌

టెండర్‌ రద్దుచేయాలని ప్రభుత్వానికి లేఖ

శ్లాబ్‌కు నోచుకోని పందూరు వంతెన

రూ.3 కోట్ల నుంచి రూ.4.3 కోట్లకు పెరిగిన అంచనా వ్యయం

నిధులు మంజూరుకు ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రతిపాదనలు


కోటవురట్ల, మే 17:

మండలంలో రవాణా వ్యవస్థ అత్యంత అధ్వానంగా వుంది. వరహా నదిపై జల్లూరు, పందూరు గ్రామాల వద్ద  టీడీపీ హయాంలో చేపట్టిన వంతెనల నిర్మాణాలు మూడేళ్ల నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ఆదేశాల మేరకు జల్లూరు వంతెన కాంట్రాక్టర్‌ పనులు నిలిపివేశారు. గడువు ముగిసినందున టెండర్‌ను అగ్రిమెంట్‌ను రద్దు చేయాలని  ప్రభుత్వానికి లేఖ రాశారు. పందూరు వంతెన నిర్మాణ పనులు పూర్తిచేయడానికి రూ.4.3 కోట్లు మంజూరు చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.  నిధులు మంజూరైతే టెండర్లు పిలుస్తామని చెబుతున్నారు.

అసంపూర్తిగా జల్లూరు వంతెన

మండలంలోని జల్లూరు వద్ద వరహా నదిపై బ్రిటీష్‌ కాలంలో నిర్మించిన వంతెన శిథిలస్థితికి చేరడంతో సుమారు పదేళ్ల నుంచి లారీలు, బస్సులు వంటి భారీ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఇక్కడ కొత్త వంతెన నిర్మాణానికి 2014లో రూ.4.5 కోట్లు మంజూరు అయ్యాయి. టెండర్ల ఖరారు ప్రక్రియ పూర్తయిన తరువాత టెండర్‌ దక్కని కాంట్రాక్టర్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు. దీంతో మూడేళ్లపాటు వంతెన నిర్మాణ పనులు మొదలుకాలేదు. తరువాత అప్పటి ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి అయ్యన్న పాత్రుడు జోక్యం చేసుకుని, కోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకునేలా కృషి చేశారు. వంతెన నిర్మాణ పనులకు 2018 జనవరి 5వ తేదీన అయ్యన్నతోపాటు నాటి జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మకాయల చినరాజప్ప శంకుస్థాపన చేశారు. 2019 ఫిబ్రవరినాటికి రూ.2.30 కోట్ల మేర పనులు పూర్తికావడంతో ఆ మేరకు బిల్లులు మంజూరయ్యాయి. తదుపరి పనులు కొనసాగిస్తుండగా సార్వత్రిక ఎన్నికలు జరిగి వైసీపీ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కాంట్రాక్టర్‌ పనులు ఆపేశారు. అప్పటికి మరో రూ.15 లక్షల విలువైన పనులు జరిగాయి. దాదాపు రెండున్నరేళ్ల పాటు వంతెన నిర్మాణం విషయంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఎట్టకేలకు ఈ ఏడాది మార్చిలో కాంట్రాక్టర్‌కు రూ.15 లక్షలు చెల్లించి, నిర్మాణ పనులను పునఃప్రారంభించాలని ఆర్‌అండ్‌బీ అధికారులు కోరారు. అయితే సిమెంటు, స్టీలు, ఇసుక, పిక్క ధరలు, కూలి రేట్లు 

Updated Date - 2022-05-18T06:34:09+05:30 IST