అసమర్థ పాలకులను ఇంటికి పంపండి

ABN , First Publish Date - 2022-07-04T04:18:40+05:30 IST

అసమర్థ పాలకులను ప్రజలు ఇంటికి పంపాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.

అసమర్థ పాలకులను ఇంటికి పంపండి
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి పిలుపు

టీడీపీలోకి 100 కుటుంబాలు చేరిక

కొమరోలు, జూలై 3 :  అసమర్థ పాలకులను ప్రజలు ఇంటికి పంపాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. ఆదివారం రాత్రి తాటిచెర్లమోటు నుంచి ఒంగోలు రోడ్డు వరకు భారీ  ర్యాలీ నిర్వహించారు. అనంతరం బాదుడే బాదుడు కార్యక్రమాన్ని మండల పార్టీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించారు. ఈసందర్భంగా అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలను అన్ని విధాలా పన్నుల భారంతో ఇబ్బందులు పెడుతున్న వైసీపీని ఇంటికి సాగనంపేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదలపై భారాలు మోపడమే పనిగా పెట్టుకుందని అశోక్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.   పాలన చేతకాక నెలనెలా ప్రజలపై ఏదో ఒక రూపంలో ధరలతో బాదేస్తు న్నారన్నారు. వైసీపీ అనుసరిస్తున్న విధానాలు, తీరును ప్రజలు గమనిస్తు న్నారన్నారు. ప్రజాగ్రహానికి తలదించక తప్పదన్నారు. పథకాల ముసుగులో జగన్‌రెడ్డి పేదలను దోచుకుంటున్నారని అన్నారు.  కార్యక్రమంలో జిల్లా రైతు కార్యదర్శి వి.వి.రాఘవరెడ్డి, ముత్యాల రవీంద్రరెడ్డి, జిల్లా ఆర్గనైజర్‌ గోనె చెన్నకేశవ్‌, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, బిజ్జం వెంకటరామిరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు తిరుమలరెడ్డి, మాజీ ఎంపీటీసీ సంజీవరెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

100 కుటుంబాలు టీడీపీలో చేరిక 

మండలంలోని పొట్టిపల్లి, గుండ్రెడ్డిపల్లి గ్రామాల్లో 100 కుటుంబాలకు చెందిన 200 మంది వైసీపీనీ వీడి టీడీపీలో చేరారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి పార్టీ కండువా క ప్పి ఆహ్వానించారు. మండలంలోని పొట్టిపల్లె గ్రామానికి చెందిన భోగ్యం నాయుడు, మండ్ల రమణ, మేకల వెంకటేశ్వర్లుకు చెందిన 50 కుటుంబాలు, దద్దవాడ పంచాయతీకి చెందిన సీగె శ్రీనివాసులు, పొట్టిపల్లి వైసీపీ వార్డుమెంబర్‌ దొనపాటి వెంకటేశ్వర్లు, తుర్రా వెంకటేశ్వర్లు, దొనపాటి శ్రీనుకు చెందిన 50 కుటుంబాలు మొత్తం 200 మంది చేరగా, వారిని అశోక్‌రెడ్డి సాదరంగా పార్టీలోకి ఆహానించారు. టీడీపీ విజయా నికి కృషి చేయాలని అశోక్‌రెడ్డి కోరారు. 

వైసీపీ పాలనకు చరమగీతం పాడాలి

మాజీ ఎమ్మెల్యే కందుల 

తర్లుపాడు, జూలై 3 :  అసమర్థ వైసీపీ పాలనకు చరమగీతం పలకాలని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. తర్లుపాడులో ఆదివారం బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ నాయకులు తర్లుపాడు పురవీధుల్లో ర్యాలీ నిర్వహిస్తూ వైసీపీ పేదలపై మోపుతున్న ధరల భారాలు, పన్నులపై నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కందుల మాట్లాడుతూ ఎన్ని కల ముందు వైసీపీ ఇచ్చిన హామీలు మూడేళ్లయినా నెరవేర్చలేదన్నారు. ఇది జగన్‌రెడ్డి అసమర్థతకు నిదర్శనమన్నారు. నిత్యావసరాల ధరలు, గ్యాస్‌, విద్యు త్‌, బస్సు చార్జీలు పెంచిన పాలకులు చివరకు చెత్త పన్ను కూడా ముక్కు పిండి వసూలు చేస్తున్నారని కందుల ధ్వజమెత్తారు. మూడు నెలల కిందట బస్సు చార్జీలు పెంచిన ప్రభుత్వం మళ్లీ చార్జీలు పెంచడం దుర్మార్గమన్నారు. పంటల బీమా పథకంలో అవకతవకలకు పాల్పడి అర్హులైన వారికి  మొండి చేయి చూపించారన్నారు. వైసీపీ నాయకులకే బీమా  సొమ్ము దక్కిందన్నారు. వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించి రైతుల మెడకు ఉరితాళ్లు వేయాలని వైసీపీ చూస్తోందన్నారు. ఇలాంటి పాలకులను సాగనంపేందుకు ప్రజలు సి ద్ధం కావాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల కష్టాలు తీరాలంటే రానున్న ఎన్ని కల్లో టీడీపీని గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని కందుల పి లుపునిచ్చారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు ఉడుముల చిన్నపురెడ్డి, ఒంగో లు పార్లమెంట్‌ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు కె.కాశయ్య, ఎంపీటీసీ మాజీ స భ్యులు గోపీనాథ్‌, వీరయ్య యాదవ్‌, వెంకట్‌యాదవ్‌, శ్రీనివాసులు, సుబ్బయ్య, ఈర్ల వెంకటయ్య, గోసు వెంకటేశ్వర్లు, జి.నరసింహులు పాల్గొన్నారు. 




Updated Date - 2022-07-04T04:18:40+05:30 IST