సీఎం ప్రకటనను స్వాగతించిన అసదుద్దీన్

ABN , First Publish Date - 2020-07-10T19:54:34+05:30 IST

సచివాలయం ప్రాంతంలోనే కొత్త ఆలయం, మసీదు కట్టిస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్వాగతించారు. సచివాలయంలోని పాత

సీఎం ప్రకటనను స్వాగతించిన అసదుద్దీన్

హైదరాబాద్: సచివాలయం ప్రాంతంలోనే కొత్త ఆలయం, మసీదు కట్టిస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్వాగతించారు. సచివాలయంలోని పాత భవనాల కూల్చి వేత సందర్భంగా ఆ ప్రాంతంలో ఉన్న ఆలయం, మసీదు స్వల్పంగా దెబ్బతిన్నాయి. దీంతో వాటిని కూడా తీసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఆలయం, మసీదులకు ఇబ్బంది కలగడం పట్ల విచారం వ్యక్తం చేశారు. సచివాలయం ప్రాంతంలోనే ప్రస్తుతం ఉన్న వాటికంటే విశాలంగా, సౌకర్యవంతంగా ఆలయం, మసీదును నిర్మిస్తామని, వాటికోసం అయ్యే ఖర్చునంతా ప్రభుత్వమే భరిస్తుందని సీఎం ప్రకటించారు. ఈ ప్రకటనపై అసదుద్దీన్ ఒవైసీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సీఎం ప్రకటనను స్వాగతిస్తున్నానని తెలిపారు. యునైటెడ్ ముస్లిం ఫోరం తరఫున పూర్తి స్టేట్‌మెంట్‌ను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు.

Updated Date - 2020-07-10T19:54:34+05:30 IST