కమలంతో కలయికపై అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-12-06T00:37:46+05:30 IST

ఎంఐఎం కార్పొరేటర్లతో అసదుద్దీన్‌ ఒవైసీ సమావేశమయ్యారు. గ్రేటర్‌ ఫలితాలు ఎవరికీ అనుకూలంగా రాలేదని.. టీఆర్‌ఎస్‌, ఎంఐఎం మధ్య పలు డివిజన్లలో...

కమలంతో కలయికపై అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: ఎంఐఎం కార్పొరేటర్లతో అసదుద్దీన్‌ ఒవైసీ సమావేశమయ్యారు. గ్రేటర్‌ ఫలితాలు ఎవరికీ అనుకూలంగా రాలేదని.. టీఆర్‌ఎస్‌, ఎంఐఎం మధ్య పలు డివిజన్లలో హోరాహోరీ పోరు నడిచిందని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ విజయాలు ఎక్కువ కాలం ఉండవని చెప్పారు. సముద్రంలోని రెండు తీరాలు కలవనట్లే.. బీజేపీ, ఎంఐఎం ఎప్పటికీ కలవవని అసదుద్దీన్ ఈ సమావేశం సాక్షిగా కుండబద్ధలు కొట్టారు. గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎంకు మొత్తం 44 స్థానాలు దక్కాయి. టీఆర్‌ఎస్‌ 55, బీజేపీ 48 స్థానాల్లో, కాంగ్రెస్ 2 స్థానాల్లో విజయం సాధించాయి.


దీంతో.. బల్దియాలో చరిత్ర పునరావృతమైంది. ఎవరికీ సంపూర్ణ మెజార్టీ దక్కని పరిస్థితి. 150 డివిజన్ల నుంచి 150 మంది కార్పొరేటర్లు ఎన్నికయ్యారు. 49 మంది ఎక్స్‌అఫీషియో సభ్యులు. దీంతో మొత్తం సభ్యుల సంఖ్య 199. మేయర్‌ పీఠం దక్కించుకోవడానికి 100 మంది సభ్యులుండాలి. అలా ఎవరికీ లేని విచిత్ర పరిస్థితిని సిటీ ఓటర్‌ పార్టీలకు కల్పించారు. ఒక్క 2016లో మాత్రం ఒకే పార్టీకి సంపూర్ణ మెజారిటీ (99) కట్టబెట్టిన ఓటరు ఇక చాలు అనుకున్నట్లుంది. హంగ్‌ల చరిత్రకు గ్రేటర్‌లో మళ్లీ తెరలేచింది. మజ్లిస్‌ మరోసారి కింగ్‌ మేకర్‌గా మారింది.

Updated Date - 2020-12-06T00:37:46+05:30 IST