Agnipath Protest: Bulldozerను లేవనెత్తిన Owaisi

ABN , First Publish Date - 2022-06-19T21:51:17+05:30 IST

నరేంద్రమోదీ తప్పుడు నిర్ణయానికి వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మరి ఎంత మంది నిరసనకారుల ఇళ్లపైకి బుల్డోజర్లను ఎగదోశారు. ఎన్ని ఇళ్లు చూల్చారు? ఎవరి ఇల్లు కూలిపోకూడదనే మేము అనుకుంటాం. ఇళ్లు కూలిన తర్వాత పరిస్థితి..

Agnipath Protest: Bulldozerను లేవనెత్తిన Owaisi

న్యూఢిల్లీ: అగ్నిపథ్(Agnipath) పథకంపై కొనసాగుతున్న నిరసనలో పాల్గొన్న వారిలో ఎంత మంది ఇళ్లను బుల్డోజర్లతో కూల్చారని ఏఐఎంఐఎం(AIMIM) అధినేత, హైదరాబాద్ ఎంపీ(Hyderabad MP) అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) ప్రశ్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపడితే బుల్డోజర్లతో ఇళ్లను కూల్చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే తాము ఎవరి ఇంటినీ కూల్చాలనే ఉద్దేశంలో చెప్పలేదని, కాకపోతే ముస్లింలపై ఉద్దేశపూర్వంగా జరుగుతున్న విధ్వంసాన్ని చెప్పాలనే ప్రయత్నంలో భాగంగానే ప్రశ్నిస్తున్నామని ఓవైసీ అన్నారు.


‘‘నరేంద్రమోదీ తప్పుడు నిర్ణయానికి వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మరి ఎంత మంది నిరసనకారుల ఇళ్లపైకి బుల్డోజర్లను ఎగదోశారు. ఎన్ని ఇళ్లు చూల్చారు? ఎవరి ఇల్లు కూలిపోకూడదనే మేము అనుకుంటాం. ఇళ్లు కూలిన తర్వాత పరిస్థితి ఎంత బాధాకరంగా ఉంటుందో మాకు తెలుసు’’ అని అన్నారు. ఇక వారణాసిలోని ఒక పోలీసు అధికారి, నిరసనకారులను తమ పిల్లలని, వారితో మాట్లాడి కౌన్సింగ్ ఇవ్వాలని వ్యాఖ్యానించడంపై ఓవైసీ స్పందిస్తూ ‘‘ముస్లింలు ఆయన పిల్లలు కాదా? ముస్లిం పిల్లలు ఈ దేశ ప్రజలు కాదా? పోయిన శుక్రవారమే మీరు మాతో మాట్లాడి ఉండాల్సింది’’ అని అన్నారు. మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత నుపుర్ శర్మ వ్యాఖ్యల అనంతరం శుక్రవారం ప్రార్థనల అనంతరం దేశంలోని పలు ప్రాంతాల్లో అల్లర్లు జరిగిని విషయం తెలిసిందే.

Updated Date - 2022-06-19T21:51:17+05:30 IST