Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 20 2021 @ 18:55PM

గ్యాంగ్‌స్టర్‌ను కలుసుకునేందుకు ఒవైసీకి అనుమతి నిరాకరణ

అహ్మదాబాద్: తొంభైకి పైగా క్రిమినల్ కేసులతో జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అథిక్ అహ్మద్‌ను కలుసుకునే విషయంలో ఎఐఎంఐఎం చీఫ్‌కు చుక్కెదురైంది. అథిక్ అహ్మద్‌ను ఒవైసీ కలుసుకునేందుకు సబర్మతి జైలు అధికారులు అనుమతి నిరాకరించారు. ఒవైసీ అహ్మదాబాద్ పర్యటనను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్తగా  జైలు చుట్టూ భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. జైలు నిబంధనలు, కోవిడ్ మహమ్మారి కారణంగా అనుమతి నిరాకరించినట్టు జైలు అధికారులు తెలిపారు. జైలు నిబంధనల ప్రకారం రక్త సంబంధీకులు, కేసులను వాదిస్తున్న లాయర్లను మాత్రమే కలుసుకునేందుకు అనుమతిస్తున్నామనీ, కోవిడ్ వ్యాప్తి చెందే అవకాశాలను కూడా దృష్టిలో ఉంచుకుని అనుమతి నిరాకరించాల్సి వచ్చిందని అహ్మదాబాద్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రోహన్ ఆనంద్ చెప్పారు.

ఈనెల మొదట్లో ఒవైసీ ఉత్తరప్రదేశ్‌లో పర్యటించినప్పుడు, అథిక్ అహ్మద్, అతని భార్య ఎంఐఎంలో చేరినట్టు మీడియాకు చెప్పారు. ''క్రిమినల్ రికార్డు ఉన్న వారిని పార్టీలోకి ఎందుకు తీసుకున్నారని మీరు అడగవచ్చు. బీజేపీ నుంచి గెలుపొందిన వారిలో ఎక్కువ మందిపై క్రిమినల్ కేసులున్నాయి. దీనిపై ఏడీఆర్ రిపోర్ట్ కూడా ఉంది'' అని ఒవైసీ అన్నారు. అథిక్ అహ్మద్‌ను 2019 జూన్‌లో ప్రయాగ్‌రాజ్ సెంట్రల్ జైలు నుంచి సబర్మతి సెంట్రల్ జైలుకు మార్చారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement