అధికారులు దిగొచ్చారు

ABN , First Publish Date - 2021-05-11T05:59:29+05:30 IST

రంపచోడవరంలో గత 21 రోజులుగా ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్ల గోడు ఫలించింది. అధికారులు ఎట్టకేలకు దిగివచ్చి సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో వారు దీక్ష విరమించి మంగళవారం నుంచి విధులకు హాజరుకానున్నారు.

అధికారులు దిగొచ్చారు
దీక్షా శిబిరం వద్ద ఆశా వర్కర్లతో మాట్లాడుతున్న ఏడీఎంహెచవో

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో ఆశ వర్కర్ల సమస్యలపై చర్చించిన ఐటీడీఏ పీవో 
  • రెండు వారాల్లో పరిష్కారానికి ఏడీఎంహెచవో హామీ
  • దీక్ష విరమించిన ఆశా కార్యకర్తలు 
  • నేటి నుంచి విధుల్లో చేరతామని ప్రకటన

రంపచోడవరం, మే 10: రంపచోడవరంలో గత 21 రోజులుగా ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్ల గోడు ఫలించింది. అధికారులు ఎట్టకేలకు దిగివచ్చి సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో వారు దీక్ష విరమించి మంగళవారం నుంచి విధులకు హాజరుకానున్నారు. మన్యంలో క్షేత్ర స్థాయిలో దీటైన ఆరోగ్య సేవలందించే ఆశా వర్కర్ల సమస్యలను ఏకరువు పెడుతూ సోమవారం ఆంధ్రజ్యోతిలో ‘ఆశా వర్కర్ల గోడు పట్టని అఽధికారులు’ శీర్షికతో కథనం వచ్చిన నేపథ్యంలో అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇది ఐటీడీఏ పీవో దృష్టికి వెళ్లడంతో ఆయన ఏజెన్సీ వైద్య, ఆరోగ్య శాఖా ధికారి, పలువురు వైద్యాధికారులతో ఆశా వర్కర్ల సమస్యలపై చర్చించారు. రెండు వారాలు గడువు తీసుకుని వాటిని పరిష్కరించాలని దీక్షా శిబిరం వద్దకు ఏడీఎంహెచవోను పంపించి ఆశా వర్కర్లతో దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్ల సంఘం నాయకురాలు మట్ల వాణిశ్రీ మా ట్లాడుతూ 21 రోజుల పాటు తమ గోడు పట్టని అధికారులు మీడియాలో వచ్చిన కథనాలతోనైనా స్పం దించారని, ఈ పాటికే తమ సమస్యలపై చర్చించి ఉంటే ఆందోళనకు తెరపడి ఉండేదన్నారు. అధికా రులు రెండు వారాల్లో సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని చెప్పారు.


Updated Date - 2021-05-11T05:59:29+05:30 IST