బ్యాంకులు రుణాలు ఇవ్వనందుకే..

ABN , First Publish Date - 2022-06-26T00:31:06+05:30 IST

అమరావతి: బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు అంగీకరించకపోవటంతో సొంతంగా నిధుల సమీకరణకు ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో రాజధాని

బ్యాంకులు రుణాలు ఇవ్వనందుకే..

అమరావతి: బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు అంగీకరించకపోవటంతో సొంతంగా నిధుల సమీకరణకు ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో రాజధాని భూములను విక్రయించేందుకు సీఆర్డీఏ ప్రణాళిక రూపొందించింది. తొలివిడతలో 248.34 ఎకరాలను విక్రయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఎకరాకు రూ. 10 కోట్ల చొప్పున రూ. 2480 కోట్లు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేలం ద్వారా భూముల విక్రయానికి ప్రభుత్వం అనుమతిస్తూ 389 జీవో జారీ చేసింది. గతంలో బీఆర్ షెట్టీ మెడిసిటీ కోసం ఇచ్చిన 100 ఎకరాలు, లండన్ కింగ్స్ కాలేజికి ఇచ్చిన 148 ఎకరాలను విక్రయించాలని సీఆర్డీఏ నిర్ణయించింది. పురపాలక శాఖపై ఇటీవల ముఖ్యమంత్రి జగన్ నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి ఏడాదికి 50 ఎకరాల చొప్పున 600 ఎకరాల విక్రయానికి ప్రభుత్వం  ప్రణాళిక తయారుచేసింది. వచ్చే నెలలో భూములను వేలం ద్వారా విక్రయించనున్నారు. 

Updated Date - 2022-06-26T00:31:06+05:30 IST