Prepaid Plans: ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా(Vi) యూజర్లకు బ్యాడ్‌న్యూస్.. సిద్ధంగా ఉండండి.. దేనికంటే..

ABN , First Publish Date - 2022-05-25T23:25:52+05:30 IST

ఈ మధ్య కాలంలో అన్నింటి ధరలు పెరిగిపోతున్నాయి. పెట్రోల్, గ్యాస్, వంట నూనె, ఉప్పులుపప్పులు మాత్రమే కాదు ఇప్పుడు ఈ జాబితాలో..

Prepaid Plans: ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా(Vi) యూజర్లకు బ్యాడ్‌న్యూస్.. సిద్ధంగా ఉండండి.. దేనికంటే..

ఈ మధ్య కాలంలో అన్నింటి ధరలు పెరిగిపోతున్నాయి. పెట్రోల్, గ్యాస్, వంట నూనె, ఉప్పులుపప్పులు మాత్రమే కాదు ఇప్పుడు ఈ జాబితాలో టెలీకమ్యూనికేషన్స్ కూడా చేరింది. టెలీ కమ్యూనికేషన్ కంపెనీలు ప్రీపెయిడ్ ప్లాన్లపై వడ్డనకు సిద్ధమయ్యాయి. తాజా రిపోర్ట్స్ ప్రకారం.. ఎయిర్‌టెల్, జియో, వోడాఫోన్ ఐడియా కంపెనీలు ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచబోతున్నట్లు తెలిసింది. ప్రీపెయిడ్ ప్లాన్లపై 10 నుంచి 12 శాతం వరకూ ఈ పెంపు ఉంటుందని సమాచారం. ప్రీపెయిడ్ ప్లాన్లపై నవంబర్‌లో ఈ పెంపు ఉండనుందని.. దీపావళి నుంచి జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలు పెరగనున్నాయని తెలిసింది. సరిగ్గా సంవత్సరం క్రితం ఇలాగే గతేడాది నవంబర్‌లో ఊహించని విధంగా టెలికాం కంపెనీలు ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచాయి. ఆ సమయంలో పోస్ట్‌పెయిడ్ ధరలపై ఆ పెంపు ప్రభావం పడలేదు. కానీ.. ప్రీపెయిడ్ సిమ్స్ వాడుతున్న యూజర్లు మాత్రం 20 నుంచి 25 శాతం ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలు పెంచేయడంతో అల్లాడిపోయారు.



25 శాతం టారిఫ్స్ పెంచినా యూజర్లు దూరం కావడం వంటి పరిణామాలేవీ జరగకపోవడంతో ఆ ధీమాతోనే మళ్లీ టెలికాం కంపెనీలు టారిఫ్స్‌ను పెంచాలనే నిర్ణయానికొచ్చినట్లు తెలిసింది. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ప్రీపెయిడ్ ప్లాన్లతో పోల్చుకుంటే జియో ప్రీపెయిడ్ ప్లాన్లు కొంత తక్కువ ధరలకు అందుబాటులో ఉండటంతో కొందరు యూజర్లు జియోకు మారిపోయారు. కానీ.. ఆ సంఖ్య చాలా తక్కువే. చాలామంది ప్రీపెయిడ్ ప్లాన్లు పెంచినప్పటికీ అలానే ఉన్నారు. అందువల్ల టారిఫ్ ధరలను పెంచడం వల్ల యూజర్లు చేజారే ప్రమాదం స్వల్పమేనని భావించి టెలికాం కంపెనీలు మరోసారి ధరల పెంపు ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇతర దేశాల్లో టారిఫ్స్‌తో పోల్చుకుంటే భారత్‌లోనే ఇప్పటికీ టారిఫ్స్ ధర తక్కువ కావడం గమనార్హం.

Updated Date - 2022-05-25T23:25:52+05:30 IST