భవిష్య ప్రణాళికలో భాగంగానే..

ABN , First Publish Date - 2021-09-17T07:31:17+05:30 IST

భవిష్యత్‌ ప్రణాళికలో భాగంగానే విరాట్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నాడని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ తెలిపాడు.

భవిష్య ప్రణాళికలో భాగంగానే..

విష్యత్‌ ప్రణాళికలో భాగంగానే విరాట్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నాడని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ తెలిపాడు. ‘భారత్‌ క్రికెట్‌కు కోహ్లీ విలువైన ఆస్తి. ఎంతో సామర్థ్యంతో అతడు జట్టును నడిపిస్తున్నాడు. అన్ని ఫార్మాట్లలో విజయవంతమైన కెప్టెన్‌లలో విరాట్‌ ఒకడు. భారత క్రికెట్‌ భవిష్య రోడ్‌మ్యా్‌పలో భాగంగానే అతడు నిర్ణయం తీసుకున్నాడు. రాబోయే ప్రపంచ కప్‌నకు అతడికి శుభాభినందనలు. విరాట్‌ భవిష్యత్‌లో మరెన్నో పరుగులు సాధించాలని ఆశిస్తున్నా’ అని గంగూలీ అన్నాడు. 

Updated Date - 2021-09-17T07:31:17+05:30 IST