Abn logo
Sep 17 2020 @ 00:30AM

మహేశ్‌ సోదరిగా?

మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించనున్న ‘సర్కారు వారి పాట’లో బాలీవుడ్‌ హీరోయిన్‌ విద్యా బాలన్‌ కనిపించనున్నారా? అంటే కనిపించే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్‌నగర్‌ వర్గాల గుసగుస. పరశురామ్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం బ్యాంకింగ్‌ రంగంలో మోసాలు, వాటిని సంస్కరించే ఓ యువకుడి నేపథ్యంలో రూపొందనుందని సమాచారం. ఇందులో కథకు కీలకమైన హీరో సోదరి పాత్ర ఒకటి ఉందట! విద్యా బాలన్‌ ఆ పాత్రలో నటిస్తే బావుంటుందని దర్శక-నిర్మాతలు భావిస్తున్నారట. త్వరలో ఆమెను కలిసి కథ, అందులో పాత్ర ప్రాముఖ్యం వివరించాలని అనుకుంటున్నారట. ఇందులో విలన్‌గా అనిల్‌ కపూర్‌ పేరు పరిశీలనలో ఉన్నట్టు వినికిడి. నవంబర్‌లో చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈలోపు నటీనటుల ఎవరనేది స్పష్టత వస్తుందేమో! మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, 14 రీల్స్‌ ప్లస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.  

‘చిత్రజ్యోతి’లో మరిన్ని ఆసక్తికర 

కథనాల కోసం 

ఈ క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.

లేదా ఈ క్రింది యూఆర్‌ఎల్‌   

https://qrgo.page.link/swvk లో చదవండి.

Advertisement
Advertisement
Advertisement